అలీ, పునర్న‌వి మిస్సింగ్.. ఆందోళ‌న‌లో ఇంటి స‌భ్యులు

Fri,August 9, 2019 08:22 AM
Ali and Punarnavi are locked in a secret room

బిగ్ బాస్ సీజ‌న్ 3 మూడో వారం చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం నామినేష‌న్‌లో తమన్నా, పునర్నవి, రాహుల్, వితికా, బాబా భాస్కర్‌లు ఉన్నారు. వీరిలో ఒక‌రు ఈ ఆదివారం బిగ్ బాస్ హౌజ్ నుండి బ‌య‌ట‌కి వెళ్ల‌నున్నారు. అయితే ఇంటికి తొలి కెప్టెన్‌గా వ‌రుణ్‌ని ఎంపిక చేసిన బిగ్ బాస్ రెండో కెప్టెన్ కోసం దొంగ‌లున్నారు జాగ్ర‌త్త అనే టాస్క్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ టాస్క్‌లో నిధి ద‌క్కించుకునేందుకు ర‌వికృష్ణ నిధి బాక్స్ అద్ధాన్ని చేతితో ప‌గ‌ల‌గొట్టే ప్ర‌య‌త్నం చేసి గాయ‌ప‌డ్డాడు. దీంతో ఆయన మణికట్టుకి గాయమైంది. ఈ వివాదం గురించి 19వ ఎపిసోడ్‌లో కూడా చ‌ర్చ జరిగింది. వితిక ఆ సంఘ‌ట‌న గురించి త‌ల‌చుకుంటూ ఏడుస్తూ కూర్చుంది. ఆమెని వ‌రుణ్‌, రాహుల్‌లు ఓదార్చే ప్ర‌య‌త్నం చేశారు.

ర‌వికృష్ణ‌కి గాయం కావడానికి కార‌ణం శ్రీముఖి అని ఇంటి స‌భ్యులు బిగ్ బాస్‌కి చెప్ప‌డంతో ఆమెని వ‌చ్చే వారం ఎలిమినేషన్‌కు నేరుగా నామినేట్ చేశారు బిగ్ బాస్. అంతేకాదు ఈ టాస్క్‌ని కూడా ర‌ద్ధు చేశారు. ఇక ఆ త‌ర్వాత అలీ రాజా, పునర్న‌విని ఒక్కొక్కరిగా క‌న్ఫెష‌న్ రూంలోకి పిలిపించిన బిగ్ బాస్ వారికి ఓ సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ స‌క్సెస్ ఫుల్‌గా పూర్తి చేస్తే ఇమ్యునిటి ల‌భిస్తుంది. దాంతో వ‌చ్చే వారం నామినేష‌న్ కాకుండా ఉంటార‌ని బిగ్ బాస్ పేర్కొన్నారు. దీంతో ఆ సీక్రెట్ టాస్క్‌లో వారిద్ద‌రు పాల్గొనేందుకు ఆస‌క్తి చూపారు.

టాస్క్ ఏమంటే అంద‌రు ప‌డుకున్న త‌ర్వాత బెడ్‌రూం ప‌క్క‌న ఉన్న డోర్ ఓపెన్ చేసుకొని ఆ గ‌దిలోకి వెళ్లాలి. రూంలోకి వెళ్ళే స‌మ‌యంలో ఎవ‌రు చూడ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డాలి. సీక్రెట్ టాస్క్ ఆడుతున్న‌ట్టు మిగ‌తా ఇంటి స‌భ్యులు ఎవ‌రైన క‌నిపెట్టారో మీరు డైరెక్ట్‌గా ఎలిమినేష‌న్‌కి నామినేట్ అవుతార‌ని బిగ్ బాస్ తెలిపారు. దీంతో అలీ .. అర్ధ రాత్రి 1.30 గంటల సమయంలో అందరూ పడుకున్నాక ఎవరి కంట పడకుండా బిగ్ బాస్ చెప్పిన రూంలోకి వెళ్లాడు. అందులో వ‌స్తువులు, వాతావ‌ర‌ణం చూసి ఆశ్చ‌ర్య‌పోయిన అలీ కొద్ది సేపు నిద్రించాడు. ఇక పున‌ర్న‌వి ఉదయం 7.30కి ఎవరి కంట పడకుండా సీక్రెట్ రూంలోకి వెళ్లింది. అక్క‌డ అలీని చూసి ఆమె షాక్ అయింది.

ఉద‌యం 8 గంట‌ల‌కి మాయ మ‌శ్చీంద్ర అనే సాంగ్‌తో ఇంటి స‌భ్యుల‌ని లేపారు బిగ్ బాస్‌. అలీ, పునర్న‌వి క‌న‌ప‌డ‌క‌పోవ‌డంతో వారి కోసం వెతుకులాట మొద‌లు పెట్టారు. బాత్‌రూం, కన్ఫెష‌న్ రూం ఇలా ఇంట్లో అన్ని రూముల‌న్ని శోధించారు. వారు క‌న‌ప‌డ‌క‌పోవ‌డంతో బిగ్ బాస్ వారిని దాచి ఉంటార‌ని ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు ఇంటి స‌భ్యులు. అయితే బిగ్ బాస్ .. అలీ, పునర్న‌విల‌కు ఆదేశాన్ని జారీ చేశారు. మీరు సీక్రెట్ రూం నుండి బ‌య‌ట‌కి వెళ్ళాలంటే ఇంటి స‌భ్యులు రెండు త్యాగాలు చేయాల్సి ఉంటుంది. అవేమిటో మీరే డిసైడ్ చేసుకొని చెప్పండి అన‌డంతో వారు .. వారం రోజులు చెప్పులు లేకుండా న‌డ‌వాలి, పెరుగు లేకుండా అన్నం తినాల‌ని పేర్కొన్నారు.

ఇంటి స‌భ్యులంద‌రిని లివింగ్ ఏరియాలోకి పిలిపించిన బిగ్ బాస్.. అలీ, పున‌ర్న‌వి తిరిగి ఇంట్లోకి రావాల‌ని ఎంత‌మంది కోరుకుంటున్నారో చెప్పాల‌ని అన్నారు. దీంతో హిమ‌జ‌, బాబా భాస్కర్ త‌ప్ప మిగ‌త ఇంటి స‌భ్యులు వారి రాక కోసం ఎదురు చూస్తున్నామ‌ని చెప్పారు . అయితే, ఎవరైతే వాళ్లిద్దరూ రావాలని కోరుకున్నారో వాళ్లు రెండు త్యాగాలు చేయాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్పారు. వారం రోజుల పాటు ఇంట్లో చెప్పులు వేసుకొని తిర‌గ‌కూడ‌దు , భోజనంలో పెరుగు ఉండదని తెలిపారు. అలాగే.. అబ్బాయిలు నాలుగు మ్యాట్రిసెస్, రవికి ఇచ్చినవి కాకుండా పాలు, గుడ్లు స్టోర్ రూంలో పెట్టేయాలని కండీషన్ పెట్టారు. దీనికి వారు సమ్మతించారు. ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో ఎలాంటి ఆస‌క్తిక‌ర అంశాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

2645
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles