పంతం గెలిచిన శివ‌జ్యోతి.. ఇంటి కెప్టెన్‌గా బాధ్య‌త‌లు

Wed,August 21, 2019 08:26 AM
Ali and Maheshs misunderstanding escalates into a full scale fight

బిగ్ బాస్ సీజ‌న్ 3 కార్య‌క్ర‌మంలో సోమ‌వారం రోజు నామినేష‌న్ ప్ర‌క్రియ పూర్తైంది. ఈ సారి కూడా ఎలిమినేష‌న్‌లో ఏడుగురు స‌భ్యులు( బాబా భాస్క‌ర్, పునర్నవి, మహేష్, హిమజ, అషు, మహేష్, రాహుల్‌) ఉండగా, వారిలో ఎవరు ఇంటి నుండి వెళ‌తారో ఖ‌చ్చితంగా చెప్ప‌లేని ప‌రిస్థితి. గ‌త వారం చేసిన త‌ప్పు కార‌ణంగా ఈ వారం కూడా డైరెక్ట్‌గా నామినేష‌న్‌కి వెళ్ళింది శివ జ్యోతి.. అయితే మంగ‌ళ‌వారం రోజు బిగ్ బాస్ ఇచ్చిన పంతం నీదా నాదా అనే టాస్క్‌లో ప‌ట్టు బిగించి విజ‌యం సాధించింది. దీంతో ఐదోవారం ఇంటి కెప్టెన్‌గా కొత్త బాధ్య‌త‌లు అందుకుంది శివ జ్యోతి.

31వ ఎపిసోడ్‌లో బాబా భాస్క‌ర్‌ని అలీ డైరెక్ట్‌గా నామినేట్ చేయడం చ‌ర్చ‌కి దారి తీసింది. బాబా భాస్క‌ర్ చాలా ఫీల‌య్యాడ‌ని వ‌రుణ్‌, అలీ, శ్రీముఖి చ‌ర్చ జ‌రిపారు. అది కావాలని చేసింది కాద‌ని బాబాకి స‌ర్ధి చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు అలీ. ఇంత‌లో మ‌హేష్ మ‌ధ్య‌లో క‌లుగ జేసుకొని బాబా భాస్క‌ర్ బ‌దులు వేరే వాళ్ళ‌ని నామినేట్ చేయోచ్చు క‌దా అనే స‌రికి కోపోద్రిక్తుడైన అలీ.. నువ్వు మ‌ధ్య‌లో పుల్ల‌లు పెట్టకు మా ప్రాబ్ల‌మ్ మేం సాల్వ్ చేసుకుంటాం అని కాస్త గ‌ట్టిగానే అరిచాడు అలీ. పుల్లలు పెట్ట‌కు అనీ అలీ స‌రికి ఒళ్ళు మండిన మ‌హేష్ నేను ఎప్పుడు ఎవ‌డికి పుల్ల‌లు పెట్టా అని అలీపై ఎగిరాడు. ఈ వాద‌న కొద్దిసేపు జ‌ర‌గ‌గా, వారిరివురిని కూల్ చేసే ప్ర‌య‌త్నం చేసారు ఇంటి స‌భ్యులు

వితికా, పున‌ర్న‌విల‌ని శ్రీముఖి, అషూలు ర్యాగింగ్ చేశారు. పాట‌లు పాడిస్తూ డ్యాన్స్ చేపిస్తూ కాసేపు ఫ‌న్ క్రియేట్ చేశారు. మ‌ధ్య‌లో ఎంట్రీ ఇచ్చిన బాబా కూడా ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేశారు. ఇక కోర్డు యార్డ్‌లో వ‌రుణ్‌- వితికాల పెళ్లి వేడుక‌ని ఘ‌నంగా జ‌రిపారు ఇంటి స‌భ్యులు. మాటే మంత్ర‌మూ అనే పాట పాడుతుండ‌గా, వారిరివురు దండ‌లు మార్చుకున్నారు. అక్షింత‌ల‌తో వారిరివురిని దీవించారు తోటి హౌజ్‌మేట్స్. ఆ త‌ర్వాత బిగ్ బాస్ ఈ సారి హౌజ్‌కి కెప్టెన్‌గా ఉండేందుకు మ‌హిళ‌ల‌కి అవ‌కాశం ఇచ్చారు. బ‌జ‌ర్ మోగ‌గానే ఎవ‌రైతే ముందు వెళ్లి కన్ఫెష‌న్ రూంలో ఉన్న సీట్లో కూర్చొంటారో వారికి కెప్టెన్ టాస్క్ ఆడే అవ‌కాశం ద‌క్కుతుంద‌ని చెప్పుకొచ్చారు

బ‌జ‌ర్ మోగ‌గానే ముందుగా క‌న్ఫెష‌న్ రూంలోకి వెళ్ళి కూర్చున్న వితికా, శివజ్యోతి కెప్టెన్ టాస్క్‌లో పాల్గొన్నారు. క్రేన్‌ సాయంతో ఇద్దర్నీ స్విమ్మింగ్ ఫూల్ పై నుండి గాల్లోకి లేపి.. స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న వాట‌ర్ ట‌చ్ కాకుండా తోటి స‌భ్యులు వారిని అలానే గాలిలో ఉండేలా తాడు ప‌ట్టుకోవాలి. ఎవ‌రు ఎక్కువ సేపు గాలిలో ఉంటారో వారే విజేత‌లు అని బిగ్ బాస్ తెలిపారు. టాస్క్ మొద‌లైన త‌ర్వాత శివ‌జ్యోతి, వితికాలు గాల్లో ఉండేందుకు చాలా క‌ష్ట‌ప‌డ్డారు. ఒకానొక స‌మ‌యంలో ప‌ట్టు కోల్పోయిన వితికా త‌ను కింద‌కి దిగేందుకు సిద్ధ‌మైంది. దీంతో శివ‌జ్యోతిని ఈ వారం కెప్టెన్‌గా ఎంపిక చేశారు బిగ్ బాస్‌. త‌న‌కి స‌పోర్ట్ చేసిన అలీ, శ్రీముఖి, బాబా భాస్క‌ర్‌కి శివ‌జ్యోతి కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది.

మొత్తానికి ఇంటి కెప్టెన్‌గా ఓ మ‌హిళ‌ ఎంపిక కాగా, ఆమె ఇంటిని ఎలా కంట్రోల్ చేస్తుంది, ఇంటి వాతావర‌ణంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో చూడాలి. ఇక నేటి ఎపిసోడ్ ఫుల్ ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉండ‌నున్న‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. ఆటలు, పాట‌ల‌తో ఇంటి స‌భ్యులు ప్రేక్ష‌కుల‌కి కావ‌ల‌సినంత ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తార‌ని తెలుస్తుంది.

2930
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles