'అల‌.. వైకుంఠ‌పుర‌ములో' బ‌న్నీ అండ్ టీం

Thu,August 15, 2019 11:17 AM
Ala Vaikunthapuramulo First Glimpse released

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 19వ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుండ‌గా, సంక్రాంతికి విడుద‌ల‌య్యేందుకు సిద్ధ‌మైంది. అయితే చిత్రానికి సంబంధించి ఎన్నో టైటిల్స్ సోష‌ల్ మీడియాలో చక్క‌ర్లు కొట్టగా, తాజాగా దీనిపై మేక‌ర్స్ క్లారిటీ ఇచ్చారు. అల‌.. వైకుంఠ‌పుర‌ములో అనే టైటిల్ ఫిక్స్ చేసి సినిమాపై మ‌రింత ఆస‌క్తి పెంచారు. సినిమాకి సంబంధించి చిన్న క్లిప్ కూడా విడుద‌ల చేయ‌గా.. ఇందులో ముర‌ళీ కృష్ణ ఏంటిరా గ్యాప్ ఇచ్చావు అని బ‌న్నీని అడ‌గ‌గా.. ఇవ్వ‌లా వ‌చ్చింద‌ని అంటారు. టీజ‌ర్ ఆక‌ట్టుకునేలా ఉంది. తండ్రీ కొడుకుల సెంటిమెంట్ తో ఈ చిత్రం రూపొందుతుంద‌ని తెలుస్తుండ‌గా, ఇందులో సుశాంత్, నివేదా పెతురాజ్‌, ట‌బు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సంద‌డి చేయ‌నున్నారు. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుంది. హారికా హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

1538
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles