సాయిప‌ల్లవితో వివాహంపై స్పందించిన విజ‌య్

Fri,March 29, 2019 11:47 AM
Al Vijay opens on dating with sai pallavi

కొద్ది రోజులుగా సాయి ప‌ల్ల‌వి, ఏఎల్ విజయ్‌ల వివాహంపై ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అమలా పాల్‌ మాజీ భర్త అయిన విజయ్‌.. సాయి పల్లవి నటించిన దియ(‘కణం’ )సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే ఇద్దరూ ప్రేమించుకున్నారని, త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని జోరుగా ప్రచారం జ‌రిగింది. దీనిపై ముందుగా స్పందించిన సాయి ప‌ల్లవి .. త‌ప్పుడు వార్త‌లు రాస్తే మీడియా వ‌ర్గాల‌పై దావా వేస్తాన‌ని ఫైర్ అయింది. ఇక త‌మిళ ద‌ర్శ‌కుడు విజ‌య్ కోలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకునే అవ‌కాశం లేదు. పుకార్లు సృష్టించి, రెండు కుటుంబాల‌ని ఇబ్బందుల‌లో పెట్ట‌కండి అని విజ‌య్ స్ప‌ష్టం చేశారు. జూన్ 12, 2014న‌ అమ‌లాపాల్‌ని వివాహం చేసుకున్న విజ‌య్ ప‌లు కార‌ణాల వ‌ల‌న 2017లో ఆమెకి డైవ‌ర్స్ ఇచ్చాడు. ఏఎల్ విజ‌య్ ప్ర‌స్తుతం దేవి 2 చిత్రంతో పాటు జ‌య‌ల‌లిత జీవిత నేప‌థ్యంలో సినిమా చేస్తున్నాడు. హిందీ, త‌మిళంలో విడుద‌ల కానున్న ఈ చిత్రంలో కంగనా ర‌నౌత్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఇక సాయిప‌ల్ల‌వి .. సూర్య హీరోగా తెర‌కెక్కుతున్న ఎన్జీకే చిత్రం చేస్తుంది. మే 31న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

5439
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles