అసోంకు అండగా నిలిచిన స్టార్ హీరో..

Wed,July 17, 2019 07:28 PM
Akshaykumar will donates 2 crores to flood hit assam


అసోంలో భారీ వర్షాలు, వరదలతో నిరాశ్రయులైన బాధితులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చాడు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. అసోంను తనవంతుగా ఆదుకునేందుకు అక్షయ్ కుమార్ రూ.2 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. వరదల్లో దెబ్బతిన్న ప్రఖ్యాత కజిరంగా నేషనల్ పార్కు కోసం రూ.కోటి, అసోం సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. కోటి చొప్పున మొత్తం రూ.2 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ తన అభిమానులు కూడా తోచినంత సహాయం చేయాలని పిలుపునిచ్చాడు అక్షయ్.మరోవైపు స్ప్రింటర్ హిమా దాస్ సీఎం రిలీఫ్ ఫండ్ తన నెల జీతంలో సగం విరాళంగా ఇస్తున్నట్లు ట్వీట్ చేసింది. 33 జిల్లాలకు దాదాపు 30 జిల్లాల్లో వరద ముంపుతో తీవ్రంగా నష్టం జరిగింది. వరదల్లో నిరాశ్రయులైన వారికి నా వంతుగా తోచిన సహాయం చేస్తున్నా. కార్పోరేట్ సంస్థలు, ప్రజలు అసోంను ఆదుకునేందుకు సాయం చేయాలని కోరింది హిమాదాస్.


అసోంలో కుండపోత వర్షాలతో బ్రహ్మపుత్ర, సుబాన్‌సిరి, ధన్‌సిరి, జియాభరలి, కొపిలి, ధరామ్‌తుల్‌, పుతీమరి, బేకి, బరాక్‌, బాదర్‌పూర్‌ నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. 30 జిల్లాలు వరదల గుప్పిట్లో చిక్కుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40 లక్షల మందికిపైగా నిరాశ్రయులవగా..4 వేలకుపైగా గ్రామాలు నీటమునిగినట్లు అధికారులు చెబుతున్నారు.

1467
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles