రజనీకాంత్‌ని మించిపోయిన అక్షయ్‌

Wed,April 12, 2017 09:37 AM

స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ 2.0. రజినీకాంత్, అమీ జాక్సన్ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకుంది. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని టీం భావిస్తుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి వస్తున్న వార్తలు ఆడియన్స్ కి ఆశ్చర్యంతో పాటు థ్రిల్ ని కలిగిస్తున్నాయి. యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఈ మూవీలో ప్రతి నాయకుడి పాత్ర పోషిస్తుండగా, ఈ బాలీవుడ్‌ నటుడికి రజినీకాంత్ ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారట. దాదాపు రోజుకు రూ.2 కోట్లు నిర్మాతలు పారితోషికంగా ఇస్తున్నట్టు సమాచారం. అయితే అంత భారీ మొత్తాన్ని ఇచ్చేందుకు కారణం కూడా లేకపోలేదు.


2.0 చిత్రంలో అక్షయ్‌ కాకీ గెటప్ లో కనిపించనుండగా, ఈ గెటప్ కోసం ప్రతి రోజు ఎక్కువ సార్లు మేకప్ వేసుకోవలసి వచ్చేదంట. తన 25 ఏళ్ళ సినీ అనుభవంలో తాను ఎప్పుడు అంతలా మేకప్ వేసుకోలేదట. ఇప్పటికే విడుదలైన అక్షయ్ గెటప్ చాలామందిని ఎట్రాక్ట్ చేస్తోంది. అక్షయ్ ఈ చిత్రంలో విలన్ అయినా అతని నేచర్ లో ఒక వంక క్రూయాలిటీతో పాటు మరోవంక సాఫ్ట్ కార్నర్ కూడా ఉంటుందట. రోబో 2 లో అక్షయ్ పక్షుల ప్రేమికుడు కూడా. మనుషుల పట్ల క్రూరత్వంగా ఉండే అక్షయ్ పక్షుల పట్ల ప్రేమగా ఉంటాడట. బర్డ్ లవర్ అయిన ఆ విలన్ కు కాకి అంటే ఇష్టమట. రూ. 400 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రం ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

1425
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles