బాక్సాఫీసు రికార్డులు తిరగరాస్తున్న అక్షయ్ మూవీ..

Wed,August 21, 2019 01:30 PM
akshay movie creates new records

న్యూఢిల్లీ: స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన మిషన్ మంగళ్ సినిమా బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తోంది. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో అక్షయ్ కేసరి రెండు వారాల కలెక్షన్స్‌ను ఒక్కవారంలోనే అధిగమించి మిగితా సినిమాలకు సైతం సవాల్ విసురుతోంది మిషన్ మంగళ్. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ బ్లాక్ బ్లస్టర్ మూవీ మొదటి ఆరు రోజుల్లోనే రూ. 114కోట్లు వసూలు చేసింది. వీకెండ్‌తో పాటు మిగితా రోజుల్లోనూ మంచి కలెక్షన్లు రాబడుతోంది. మొదటి వారం కలెక్షన్లు 127కోట్ల వద్ద ముగుస్తుందని సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు.

ఈ సినిమాతో పాటు ఆగస్టు 15న విడుదలైన జన్ అబ్రహాం మూవీ బాట్లా హౌస్ రూ. 57కోట్లు వసూలు చేసింది. ఈ మూవీలో జాన్ మాత్రమే స్టార్ అప్పీయర్ కాగా, మిషన్ మంగళ్‌లో అక్షయ్‌తో పాటు విద్యాబాలన్, సోనాక్షి సిన్హ, తాప్సీ, కీర్తి కుల్హరి, నిత్యామీనన్ లాంటి స్టార్స్ ఉన్నారు.2340
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles