2.0 కోసం అక్ష‌య్ కుమార్ మేకొవ‌ర్ వీడియో

Sat,November 17, 2018 08:43 AM
Akshay Kumars look in 2.0 revealed

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ 2.0 చిత్రంలో ప్ర‌తినాయ‌క పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో అక్ష‌య్ గ‌తంలో ఎప్పుడు కనిపించ‌ని విధంగా ప్రత్యేక గెట‌ప్‌లో క‌నిపిస్తున్నాడు. ఈ లుక్ కోసం తాను చాలా క‌ష్ట‌ప‌డిన‌ట్టు చెప్పిన అక్ష‌య్ మేక‌ప్ వేసుకునేందుకు 3 గంట‌లు ప‌ట్టేద‌ని, తీసేందుకు గంట‌న్న‌ర ప‌ట్టేద‌ని ఇటీవ‌ల జ‌రిగిన ట్రైల‌ర్ లాంచింగ్ వేడుక‌లో తెలిపారు. అంతేకాదు తాను చేసిన అన్ని సినిమాల‌కి వేసుకున్నంత మేక‌ప్ ఇదొక్క సినిమాకి వేసుకున్న‌ట్టు కూడా అక్ష‌య్ పేర్కొన్నాడు. తాజాగా త‌న మేకొవ‌ర్ ఎలా మార్చారో వీడియో ద్వారా చూపించారు. ఇందులో అక్ష‌య్ ప‌డ్డ స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. అక్కీ అనే పాత్ర‌లో అక్ష‌య్ కుమార్ అద‌ర‌గొట్టాడ‌ని, ఆయ‌న పాత్ర‌కి మంచి పేరు వ‌స్తుంద‌ని చిత్ర బృందం అంటుంది. సుమారు రూ.550 కోట్లతో నిర్మించిన ఈ సినిమాలో రజనీకాంత్ శాస్త్రవేత్తగా, రోబోగా ద్విపాత్రభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయనతో పాటు అమీ జాక్సన్ కూడా మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఈ నెల 29న ఈ సినిమా దేశవ్యాప్తంగా విడుదల కానుంది. సినిమా మ‌రి కొద్ది రోజుల‌లో విడుద‌ల కానుండ‌గా, మేక‌ర్స్ సినిమాపై మ‌రింత ఆసక్తి క‌లిగేలా వీడియోలు విడుద‌ల చేస్తున్నారు. తాజాగా విడుద‌లైన అక్ష‌య్ మేకొవ‌ర్ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.1362
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles