మ‌రో హిట్‌పై క‌న్నేసిన అక్ష‌య్ కుమార్

Tue,December 18, 2018 01:37 PM
Akshay Kumars Kesari shooting completed

బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ ఇటీవ‌ల 2.0 అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో అక్ష‌య్ పాత్ర‌కి మంచి మార్కులు ప‌డ్డాయి. ఇక త్వ‌ర‌లో కేస‌రి అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నున్నాడు అక్ష‌య్. 1897లో బ్రిటీష్ ఇండియన్ బృందాలకు, ఆఫ్ఘనిస్థాన్ బృందాలకు మధ్య జరిగిన సరాగర్హి యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కింది . అనురాగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ సిక్కుగా కనిపించనున్నాడని తెలుస్తుంది. కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఫిలింస్ మ‌రియు ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో క‌థానాయిక‌గా ప‌రిణితీ చోప్రా న‌టిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ పూర్తి కావ‌డంతో చిత్ర ప్ర‌ధాన పాత్రధారులు అక్ష‌య్ కుమార్ , ప‌రిణితీ చోప్రా ట్విట్ట‌ర్ ద్వారా విష‌యాన్ని తెలియ‌జేశారు. చిత్రంలో న‌టించినందుకు నా హృద‌యం గ‌ర్వంతో ఉప్పొంగిపోతుందని అక్ష‌య్ అన్నారు. వ‌చ్చే ఏడాది మార్చి 21న ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. కేస‌రి చిత్రం మంచి విజ‌యం సాధిస్తుంద‌ని టీం భావిస్తుంది.
2246
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles