ఆన్‌లైన్‌లో అక్ష‌య్ కుమార్ 'కేసరి'

Fri,March 22, 2019 12:26 PM
Akshay Kumars Kesari falls prey to online piracy

బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ న‌టించిన తాజా చిత్రం కేస‌రి. 1897లో బ్రిటీష్ ఇండియన్ బృందాలకు, ఆఫ్ఘనిస్థాన్ బృందాలకు మధ్య జరిగిన సరాగర్హి యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కింది . అనురాగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిన్న( మార్చి 21) ప్రపంచ వ్యాప్తంగా విడుద‌లైంది. తొలి రోజే ఈ చిత్రానికి భారీ ఆద‌ర‌ణ ల‌భించింది. అక్ష‌య్ కుమార్ హై వోల్టేజ్ ప‌ర్‌ఫార్మెన్స్‌కి ప్రేక్ష‌కులు థియేట‌ర్స్ ద‌గ్గ‌ర క్యూ క‌డుతున్నారు. తొలి రోజు ఈ చిత్రం 21.77 కోట్ల వ‌సూళ్ళు సాధించింద‌ని బాలీవుడ్ టాక్. ఈ ఏడాది బాలీవుడ్‌లో తొలి రోజు భారీ క‌లెక్ష‌న్స్ సాధించిన చిత్రంగా కేస‌రి నిలిచింది. ప్ర‌స్తుతం ఈ చిత్రం స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ అవుతుండ‌గా, త‌మిళ రాక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని పైర‌సీ చేసి ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసింది. దీంతో క‌లెక్ష‌న్స్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. మూవీ రిలీజ్ అయిన త‌ర్వాతి రోజే చిత్రం ఆన్‌లైన్‌లో ప్ర‌త్య‌క్షం కావ‌డంతో నిర్మాత‌లు గ‌గ్గోలు పెడుతున్నారు. గ‌తంలో గ‌ల్లీ భాయ్, మ‌ణిక‌ర్ణిక‌,సింబా, టోట‌ల్ ఢ‌మాల్ వంటి చిత్రాలు పైర‌సీ బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే.

1234
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles