మ‌రోసారి ప్ర‌తి నాయ‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్న అక్ష‌య్ ..!

Mon,January 21, 2019 02:04 PM

బాలీవుడ్ యాక్ష‌న్ హీరో అక్ష‌య్ కుమార్ ఇటీవ‌ల సామాజిక నేప‌థ్యంలో సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్నాడు. అయితే హీరోగా అనేక సినిమాలు చేసిన అక్ష‌య్ రీసెంట్‌గా విడుద‌లైన 2.0 చిత్రంలో ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపించి అభిమానులకి ప‌సందైన వినోదాన్ని అందించాడు. ఇక మ‌రోసారి తాను ప్ర‌తినాయ‌క పాత్ర‌లో క‌నిపించేందుకు సిద్ద‌మైన‌ట్టు బాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. అవినీతి, లంచగొండితనం మీద పోరాడే ఓ స్వాతంత్య్ర సమరయోధుడి ఇతివృత్తంతో తెరకెక్కిన ఇండియన్ (తెలుగులో భారతీయుడు) చిత్రంకి సీక్వెల్‌గా ఇండియ‌న్ 2 అనే సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. శంక‌ర్‌- క‌మ‌ల్ హాస‌న్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా అభిషేక్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌. అక్ష‌య్ కుమార్ ప్ర‌తినాయ‌క పాత్ర‌లో న‌టించే అవ‌కాశం ఉంద‌ని ఇన్‌సైడ్ టాక్. దీనిపై త్వ‌రలోనే అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని అంటున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సుభాష్‌కరణ్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఇటీవ‌ల చిత్రానికి సంబంధించి ఓల్డర్, వైసర్, డెడ్లియర్ (వృద్ధుడు, జ్ఞానవంతుడు, ప్రమాదకారి) అనే క్యాఫ్షన్‌తో ఫొటోలు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

1728
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles