మిస్ అయిన షారూఖ్‌.. స్థానం ద‌క్కించుకున్న స‌ల్మాన్,అక్ష‌య్

Tue,July 17, 2018 01:27 PM
Akshay Kumar, Salman Khan Feature in Forbes  Highest Paid List

ప్ర‌ముఖ అమెరికన్ బిజినెస్ మ్యాగ‌జైన్ పత్రిక ఫోర్బ్స్ ప్ర‌తి ఏడాది అత్య‌ధిక పారితోషికం అందుకుంటున్న న‌టుల జాబితాను విడుద‌ల చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది కూడా ప్ర‌పంచ వ్యాప్తంగా అత్య‌ధికంగా పారితోషికం అందుకుంటున్న వంది మంది సెల‌బ్రిటీల జాబితాను విడుద‌ల చేసింది. ఎప్పుడు లిస్ట్‌లో ఉండే షారూఖ్ ఖాన్ ఈ సారి త‌న స్థానాన్ని పోగొట్టుకున్నాడు. ఈ ఏడాది అమెరిక‌న్ బాక్స‌ర్ ఫ్లైడ్ మేవెద‌ర్ టాప్ ప్లేస్‌లో ఉండ‌గా, అక్ష‌య్ కుమార్ 76వ స్థానంలో ఉన్నారు. స‌ల్మాన్‌కి 82వ స్థానం ద‌క్కింది. గత ఏడాది బాలీవుడ్ హీరోలు షారుక్‌ ఖాన్‌- 38 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.243 కోట్లు), సల్మాన్‌ ఖాన్‌- 37 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.237 కోట్లు), అక్షయ్‌కుమార్‌- 35.5 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.227 కోట్లు)తో 8,9, 10 స్థానాల‌లో ఉన్నారు.

ఈ ఏడాది ఫోర్బ్స్ పత్రిక ప్ర‌క‌టించిన జాబితా ప్ర‌కారం 50 ఏళ్ల అక్ష‌య్ కుమార్ 40.5 మిలియ‌న్ డాలర్స్ అందుకుంటున్నారు. టాయ్ లెట్‌, ప్యాడ్‌మాన్ వంటి సామాజిక చిత్రాల‌తో ఎక్కువ పారితోషికం అందుకుంటున్న తొలి భార‌తీయ న‌టుడు అక్ష‌య్ కుమార్ అని ఫోర్బ్స్ పత్రిక తెలిపిందిది. స‌ల్మాన్ ఖాన్ 38 మిలియ‌న్ డాల‌ర్స్‌తో 82వ స్థానాన్ని ద‌క్కించుకున్నాడు. ఇక ఫోర్బ్స్ ప‌త్రిక ప్ర‌కారం తొలి స్థానంలో ఫ్లైడ్ మేవెద‌ర్ ( 285 మిలియ‌న్ డాల‌ర్లు) ఉండ‌గా, రెండో స్థానంలో జార్జ్ క్లూనీ ( 239 మిలియ‌న్ డాల‌ర్స్), మూడో స్థానంలో కిలీ జెన్న‌ర్ ( 166.5 మిలియ‌న్ డాలర్స్‌), నాలుగో స్థానంలో జూడీ షెందిలిన్ ( 147 మిలియ‌న్ డాల‌ర్లు), ఐదో స్థానంలో డ్వెయిన్ జాన్సన్ (124 మిలియ‌న్ డాల‌ర్లు), ఆరో స్థానంలో యూ2( 118 మిలియ‌న్ డాల‌ర్లు), ఏడో స్థానంలో కోల్డ్ ప్లే (115.5 మిలియ‌న్ డాల‌ర్లు), ఎనిమిదో స్థానంలో ల‌యోనెల్ మెక్సీ( 111 మిలియ‌న్ డాల‌ర్లు), తొమ్మిదో స్థానంలో ఎడ్ శీర‌న్ ( 110 మిలియ‌న్ డాల‌ర్లు), ప‌దో స్థానంలో క్లిస్టియోనో రొనాల్డో (108 మిలియ‌న్ డాల‌ర్లు) ఉన్నారు.

1177
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS

Namasthe Telangana Property Show

Featured Articles