క‌త్తి రీమేక్ కోసం ఇద్ద‌రు హీరోల మ‌ధ్య పోటీ

Fri,August 24, 2018 10:20 AM
akshay kumar, ranveer singh to play crucial role in remake movie

ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా త‌మిళంలో మురుగ‌దాస్ తెర‌కెక్కించిన చిత్రం క‌త్తి. సామాజిక నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ళ సునామి సృష్టించింది. ఇప్పుడు ఇదే చిత్రాన్ని తెలుగులో చిరంజీవి రీమేక్ చేశారు. ఖైదీ నెం 150 పేరుతో తెర‌కెక్కిన రీమేక్ చిత్రం ఇక్కడ భారీ విజ‌యం సాధించింది. హిందీలోను ఈ మూవీని రీమేక్ చేసేందుకు ముందుకు వ‌చ్చారు ప్రముఖ నిర్మాత, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ.

క‌త్తి హిందీ రీమేక్‌లో స్టార్ హీరో అక్షయ్ కుమార్ లేదా యువ హీరో ర‌ణ్‌వీర్ సింగ్ నటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. భ‌న్సాలీ గ‌తంలో తెర‌కెక్కించిన రీమేక్ చిత్రాల‌లో అక్ష‌య్ న‌టించ‌గా, అవి భారీ విజ‌యం సాధించాయి. దీంతో క‌త్తి రీమేక్ కోసం అక్ష‌య్ అయితేనే బాగుంటుంద‌ని టీం భావిస్తుంద‌ట. త‌మిళ వ‌ర్షెన్‌కి కొన్ని మార్పులు చేసి ఆ త‌ర్వాత సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళ‌నున్నార‌ని స‌మాచారం.

2184
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles