రూ.100 కోట్ల క్లబ్ దిశగా 'మిషన్‌మంగళ్`

Mon,August 19, 2019 02:52 PM
Akshay Kumar Mission Mangal to reach 100 Cr club

ముంబై: బాలీవుడ్ స్టార్లు అక్షయ్‌కుమార్, విద్యాబాలన్, సోనాక్షిసిన్హా ప్రధానపాత్రల్లో వచ్చిన చిత్రం 'మిషన్‌మంగళ్`. జ‌గ‌న్ శ‌క్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకొచ్చి..బాక్సాపీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. విడుదలైన తొలి రోజే రూ.29.16 కోట్లు వసూలు చేసి..అక్షయ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. మిషన్‌మంగళ్ డే టు డే సూపర్‌హిట్ కలెక్షన్లను వసూలు చేస్తూ రూ.100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టేందుకు రెడీ అయింది.

మరోవైపు జాన్ అబ్రహాం నటించిన బట్లా హౌస్ స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా మిషన్‌మంగళ్‌తోపాటు విడుదలైంది. అయితే కలెక్షన్ల పరంగా బట్లా హౌస్ తొలి రోజు రూ.15.55 కోట్లు వసూళు చేయగా..ఇప్పటివరకు మొత్తం రూ.47.99 కోట్లు వసూలు చేసింది. గతేడాది అక్షయ్‌కుమార్ నటించిన గోల్డ్, జాన్ అబ్రహాం సత్యమేవ జయతే చిత్రాలు బాక్సాపీస్ వద్ద ఓకేసారి విడుదలయ్యాయి. 2013లో భారత్‌ చేపట్టిన ‘మంగళ్‌యాన్‌‌’ మిషన్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది. తాప్సీ నిత్యా మేనన్‌, కీర్తి కుల్హరి, షర్మన్ జోషి ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ విషయాన్ని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ ద్వారా షేర్ చేశారు.

1423
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles