చిక్కుల్లో అక్షయ్ ‘మిషన్ మంగల్’

Thu,November 22, 2018 05:27 PM
Akshay Kumar Mission Mangal lands in trouble

ముంబై: బాలీవుడ్ నటుడు అక్షయ్ మిషన్ మంగల్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాప్సీ, విద్యాబాలన్, సోనాక్షిసిన్హా, నిత్యమీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లకముందే చిక్కుల్లో పడింది. మిషన్ మంగల్ సినిమా కథ తనదేనని అమెరికాకు చెందిన సినీ నిర్మాత రాధా భరద్వాజ్ కోర్టులో దావా వేశారు. నిర్మాత అతుల్ కస్బేకర్ నిర్మాణ సంస్థ స్టూడియో ఎలిప్సిస్ ఎంటర్ తన స్క్రిప్ట్ కాపీ కొట్టిందని రాధా భరద్వాజ్ ఆరోపించారు.

2016లో మిషన్ మంగల్ కథను తాను అతుల్ కస్బేకర్ తో షేర్ చేసుకున్నానని, తన అనుమతి లేకుండా కథతో సినిమ చేస్తున్నారని రాధా భరద్వాజ్ అన్నారు. మిషన్ మంగల్ కథను యూఎస్ కాపీరైట్ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకున్నట్లు రాధా భరద్వాజ్ చెప్పారు. 2016లో రాధా భరద్వాజ్ ఈ కథతో చిత్ర నిర్మాత అతుల్ కస్బేకర్ ని సంప్రదించారని, వారిద్దరి మధ్య రహస్య ఒప్పందం కూడా జరిగినట్లు రాధా భరద్వాజ్ తరపు న్యాయవాది శ్రీస్ఠి ఓఝా తెలిపారు. మరి అక్షయ్ మిషన్ మంగల్ ప్రాజెక్టు పట్టాలపైకి వెళ్తుందో లేదో చూడాలి.

1672
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles