బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ రీసెంట్గా మహీం వద్దగల హిందూజా హాస్పిటల్లో ప్రత్యక్షమయ్యారు. దీంతో ఆయన సూర్యవంశీ సినిమా షూటింగ్లో గాయపడ్డాడని, చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చాడని పుకార్లు పుట్టించారు. అయితే అసలు విషయం ఏమంటే అక్కీ భార్య ట్వింకిల్ ఖన్నా యొక్క తల్లి డింపుల్ కపాడియా చిత్ర షూటింగ్లో గాయపడ్డారట. ఆమెని చూడటానికి అక్షయ్ ఆసుపత్రికి వెళ్ళారని చెబుతున్నారు. అక్షయ్ షూటింగ్లో గాయపడ్డట్టు వస్తున్న వార్తలలో ఏ మాత్రం నిజం లేదు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ గుడ్ న్యూస్, సూర్యవంశీ, లక్ష్మీ బాంబ్ చిత్రాలలో నటిస్తున్నాడు