యాసిడ్ బాధితురాలి ఖాతాకు డబ్బు పంపిన అక్షయ్‌

Thu,September 20, 2018 10:08 PM
Akshay Kumar gives 5 lakh to acid attack survivor Laxmi Agarwal

ముంబై: బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ ఓ వైపు సినిమాలతో బిజీగా ఉన్నా..మరోవైపు సామాజిక సమస్యలపై కూడా ఎప్పటికప్పుడు స్పందిస్తుంటాడనే విషయం అందరకీ తెలిసిందే. తాజాగా యాసిడ్ బాధితురాలు లక్ష్మికి అండగా నిలిచాడు అక్షయ్.

ఏడాది నుంచి ఉద్యోగం లేక ఆర్థిక ఇబ్బందులతో తల్లడిల్లిపోతున్న లక్ష్మి అగర్వాల్‌కు అక్షయ్‌కుమార్ రూ.5 లక్షలు సాయమందించాడు. లక్ష్మి అగరాల్ బ్యాంకు ఖాతాలోకి రూ.5 లక్షలు పంపించాడు. ఓ న్యూస్ పేపర్ లో లక్ష్మి అగర్వాల్ పరిస్థితి గురించి వచ్చిన కథనం చదివి చలించిపోయిన అక్షయ్ ఈ మేరకు సాయాన్నందించాడు. తాను చేసిన సాయం చాలా చిన్నదని, దాన్ని ప్రస్తావించడం తనకు ఇష్టం లేదని అక్షయ్ అన్నాడు. లక్ష్మి అగర్వాల్ సగర్వంగా ఉద్యోగం సంపాదించేవరకు తన ఇంటి అద్దెతోపాటు బిడ్డను పోషించేందుకు ఆసరాగా నిలవాలని తన వంతు సహాయం అందించానన్నాడు అక్షయ్. 2005లో జరిగిన యాసిడ్ దాడిలో గాయపడి లక్ష్మి అగర్వాల్ అనేక ఆపరేషన్ల తర్వాత కోలుకుంది.

3718
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles