సూయి ధాగా ఛాలెంజ్..అక్షయ్ ఫెయిల్..వీడియో

Tue,September 18, 2018 07:34 PM
akshay kumar failed Thread a needle challenge

ముంబై: బాలీవుడ్ స్టార్లు వరుణ్‌ధావన్, అనుష్క శర్మ కాంబినేషన్‌లో సూయీ ధాగా చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 28న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీబిజీగా ఉన్నారు వరుణ్, అనుష్క. పలు రియాలిటీ షోల్లో పాల్గొంటూ..మరోవైపు ఆసక్తికర వీడియోలు చేస్తూ సరికొత్తగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. వరుణ్ ఈ సినిమాను ప్రమోట్ చేసేందుకు ‘థ్రెడ్ ఏ నీడిల్’ ఛాలెంజ్ ను సృష్టించాడు. ఈ ఛాలెంజ్ ప్రకారం సూదిలో దారం పెట్టాలి. దీన్ని వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేయాలి. ఈ ఛాలెంజ్‌ను వరుణ్‌ధావన్ బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్‌కు విసిరాడు.

థ్రెడ్ ఏ నీడిల్ ఛాలెంజ్‌ను స్వీకరించిన అక్షయ్..సూదిలో దారం పెట్టేందుకు చాలా సేపే ప్రయత్నించాడు. కానీ ఛాలెంజ్ గెలవలేకపోయాడు అక్షయ్. ఆ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఛాలెంజ్ అంత సులభం కాదు. థ్రెడ్ ఏ నీడిల్ ఛాలెంజ్ కోసం నేను సచిన్‌ను నామినేట్ చేస్తున్నానని ట్వీట్ చేశాడు అక్షయ్.
1930
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles