జ‌వానుల‌తో హోలీ జ‌రుపుకున్న అక్ష‌య్ కుమార్

Wed,March 20, 2019 12:30 PM

బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ ఈ మ‌ధ్య సామాజిక అంశాల‌ నేప‌థ్యంలో ప‌లు సినిమాలు చేస్తూ ప్ర‌జ‌ల‌లో చైత‌న్యం తెస్తున్నాడు. తాజాగా ఆయ‌న న‌టించిన కేస‌రి చిత్రం రేపు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కొద్ది రోజులుగా ఈ చిత్రానికి సంబంధించి ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతుండ‌గా, ఇందులో రెగ్యుల‌ర్‌గా పాల్గొంటున్నారు అక్ష‌య్. రీసెంట్‌గా జ‌వానుల‌తో క‌లిసి హోలీ సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకున్నాడు. ప‌రిణితీ చోప్రా పాట‌లు పాడ‌గా, అక్ష‌య్ కుమార్ స్టంట్స్ చేశాడు. జ‌వానుల‌తో క‌లిసి నృత్యం కూడా చేశాడు. వారిని ఉత్సాహ‌ప‌రుస్తూ అక్ష‌య్ చేస్తున్న డ్యాన్స్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.


అక్ష‌య్ న‌టించిన కేస‌రి చిత్రం 1897లో బ్రిటీష్ ఇండియన్ బృందాలకు, ఆఫ్ఘనిస్థాన్ బృందాలకు మధ్య జరిగిన సరాగర్హి యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కింది . హ‌ల్వీద‌ర్ ఇషార్ సింగ్ అనే సిక్కు పాత్ర‌లో అక్ష‌య్ క‌నిపించ‌నున్నాడు. అనురాగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఫిలింస్ మ‌రియు ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తుంది. ప‌రిణితీ చోప్రా క‌థానాయిక‌గా న‌టిస్తుంది. 21 మంది సిక్కులు, ప‌దివేల మంది ఆక్ర‌మ‌ణ దారుల‌కి మ‌ధ్య జ‌రిగిన యుద్ధంకి సంబంధించిన‌దే ఈ చిత్రం అని నిర్మాత‌లు తెలిపారు. కేస‌రి చిత్రంలో న‌టించినందుకు నా హృద‌యం గ‌ర్వంతో ఉప్పొంగిపోతుందని అక్ష‌య్ అన్నారు.

1522
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles