జైసల్మేర్ లో అక్షయ్ సైక్లింగ్, వ్యాయామం..వీడియో వైరల్

Wed,October 3, 2018 05:45 PM
akshay kumar cycling in jaisalmer vedios gone viral

జైసల్మీర్: బాలీవుడ్ నటుల్లో ఫిట్‌నెస్ మంత్రను తూచతప్పకుండా ఫాలో అయ్యే హీరో అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు అక్షయ్‌కుమార్. సరైన ఆహార నియమాలు పాటించడం, వ్యాయామం, ఎంత బిజీగా ఉన్నా రాత్రి 10 గంటల కంటే ముందే నిద్రపోవడం, సూర్యోదయానికి ముందే నిద్రలేవడం వంటి అక్షయ్ ఫిట్‌నెస్ వెనుకున్న రహస్యాలు. ఈ విషయాన్ని అక్షయ్‌కుమార్ స్వయంగా పలు ఇంటర్యూల్లో వెల్లడించాడు. అక్షయ్‌కుమార్ ఏ ప్రాంతంలో ఉన్నా తన దినచర్యను మాత్రం తప్పుకుండా ఫాలో అవుతాడు.

ప్రస్తుతం హౌస్‌ఫుల్ 4 చిత్రం షూటింగ్ కోసం రాజస్థాన్‌లోని జైసల్మేర్ లో ఉన్నాడు అక్షయ్. జైసల్మేర్ లో ఇవాళ సైక్లింగ్ చేస్తూ దినచర్యను షురూ చేశాడు. విశాలంగా, ఖాళీగా రోడ్లపై సైక్లింగ్ చేస్తూ చెమడోడ్చిన వీడియోను అక్షయ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. జీవితమంటే బ్యాలెన్సింగ్, స్థిరత్వం. జైసల్మీర్ రోడ్లపై ఉత్సాహంగా సైక్లింగ్ చేశా. మీరు నమ్మరు.. జైసల్మేర్ లో సైక్లింగ్ చేసి ఉల్లాసంగా ఫీలయ్యా. వేకువ సమయానికి నేను వీరాభిమానిని. జైసల్మీర్‌లో ఈ ఉదయం చాలా అందంగా గడిచింది. జైసల్మేర్ లోని అందమైన ప్రాంతాల్లో మెడకు సంబంధించి వ్యాయామం (నెక్ ఎక్సర్‌సైజ్ ) చేశా. ఈ వ్యాయమం నాకు ఎంతో శక్తిని, మానసిక ఉత్తేజాన్ని కలిగించింది. మరి మీ సంగతి ఏంటీ..? అని ట్వీట్ చేశాడు అక్షయ్. అక్షయ్‌కుమార్ వ్యాయామం వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి.


1615
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles