బాహుబలిపై తొలిసారి హీరోల ప్రశంస

Tue,May 16, 2017 03:27 PM
akshay kumar comments on baahubali 2

ఇప్పుడు అందరి నోట బాహుబలి మాటే. బాషా, ప్రాంతం లేకుండా బాహుబలి2 సినిమా ప్రతి ఒక్కరిని అలరించింది. ఇండియన్ సినిమా రికార్డులని తిరగరాసిన ఈ చిత్రంపై ప్రతి ఒక్కరు ప్రశంసల వర్షం కురిపించారు. హిందీలో ఈ చిత్రం అత్యధిక వసూళ్ళని రాబట్టిందంటే ఈ మూవీకి బాలీవుడ్ లో ఎంతటి ఆదరణ ఉందో అర్దం చేసుకోవచ్చు. బాలీవుడ్ ప్రముఖులందరు బాహుబలి2 సినిమాని ఆకాశానికి ఎత్తగా, ఏ ఒక్క బాలీవుడ్ హీరో కూడా ఇప్పటి వరకు ఈ సినిమాపై నోరు విప్పలేదు. రెండు వారాల తర్వాత తొలిసారి యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ బాహుబలి2 సినిమాపై ట్వీట్ చేశాడు. ఫైనల్ గా బాహుబలి ది కంక్లూజన్ సినిమా చూశాను. ఈ సినిమాకి వస్తున్న ఆదరణ సరైనదే. భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన చిత్రయూనిట్ కు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశాడు అక్షయ్. ఇటీవల నేషనల్ అవార్డు గెలుచుకున్న అక్షయ్ టాయిలెట్ చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరో హీరో రణ్ వీర్ సింగ్ కూడా బాహుబలి 2 చిత్రాన్ని ఆకాశానికి ఎత్తాడు. దీనికి సమాధానంగా రాజమౌళి థ్యాంక్స్ అని ట్వీట్ చేశాడు.
2816
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles