మీటూ ఎఫెక్ట్‌తో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న అక్ష‌య్

Fri,October 12, 2018 01:52 PM
Akshay Kumar cancels shoot of Housefull 4 after MeToo allegations

మీటూ ఉద్య‌మంతో చీక‌టి కోణాలు వెలుగులోకి వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. నానా పటేకర్‌, వికాస్‌, అలోక్‌ నాథ్‌, సుభాష్‌ ఘాయ్‌, రజత్‌ కపూర్‌, వైర‌ముత్తు వంటి ప్ర‌ముఖులు కొంద‌రు యువ‌తుల‌ని లైంగికంగా వేధించార‌ని ప‌లువురు ఆరోప‌ణ‌లు చేశారు. తాజాగా ద‌ర్శ‌కుడు సాజిద్‌ ఖాన్‌పై బాలీవుడ్‌ నటి సలోని చోప్రా సంచలన ఆరోపణలు చేసింది. నటులు డ్రెస్‌ మార్చుకునే గదుల్లోకి వచ్చి అసభ్యంగా ప్రవర్తించేవాడని, వారి డ్రెస్‌ తీసి చూపించమని అడిగేవాడని, వాటిని తను అడ్డుకోబేతే బయటకు పంపేవాడని పేర్కొంది. సినిమాలో అవకాశం కావాలంటే తనతో గడపాలన్నాడని, చాలా మంది మహిళలను ఇలానే వాడుకున్నాడని తెలిపింది స‌లోని . ఇంటర్వ్యూ సందర్భంగా మహిళ జర్నలిస్టుతో సాజిద్ ఖాన్ అసభ్యంగా ప్రవర్తించాడని కూడా స‌లోని తెలిపింది. అయితే ద‌ర్శ‌కుడిపై ప‌లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో అక్ష‌య్ కుమార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు.

వేధింపుల కేసులో ఎవ‌రున్నా కూడా వారితో సినిమా చేసేదే లేద‌ని అక్ష‌య్ తాజాగా త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు. గ‌త రాత్రి ఇట‌లీ నుండి ఇండియాకి వ‌చ్చాను. ఇక్క‌డి వార్త‌లు నన్ను చాలా డిస్ట్ర‌బ్ చేశాయి. హౌజ్ ఫుల్ 4 నిర్మాత‌ల‌కి ఫోన్ చేసి అనుమానితులుగా ఉన్న వారి విచార‌ణ పూర్త‌య్యే వర‌కు సినిమా షూటింగ్ నిలిపివేయాల‌ని కోరాను. ఈ స‌మ‌యంలో ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం ఎంతైన అవ‌స‌రం. ఆరోప‌ణ‌లు నిర్ధార‌ణ అయిన వారితో క‌లిసి ఎప్ప‌టికి ప‌నిచేయ‌ను. అలాగే వేధింపుల‌కి గురైన వారంద‌రికి న్యాయం జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నానని అక్ష‌య్ ట్వీట్‌లో పేర్కొన్నారు. క్ష‌మ‌శిక్ష‌ణ‌కి మారుపేరుగా ఉన్న అక్ష‌య్ త‌న 28 ఏళ్ల కెరీర్‌లో ఇంత వ‌ర‌కు షూటింగ్ క్యాన్సిల్ చేసింది లేదు. కాని తొలిసారి మీటూ ఉద్య‌మంతో నింద‌లు ఎదుర్కొంటున్న వారికి వ్య‌తిరేఖంగా తాను ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం గొప్ప విష‌యం. హౌజ్ ఫుల్ 4 చిత్రం సాజిద్ ఖాన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుండ‌గా ఇందులో అక్ష‌య్ కుమార్, కృతిస‌న‌న్, కృతి క‌ర్భందా ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే.2639
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS