కూతురితో స‌ర‌దా ఉలిక్కి ప‌డేలా చేసింది- వీడియో

Wed,July 26, 2017 12:38 PM

బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సినిమా విష‌యాల‌న్నింటిని అభిమానుల‌కి చేర‌వేస్తూనే మ‌రో వైపు త‌న ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌ని కూడా చెప్పి ఫ్యాన్స్ లో ఆనందాన్ని పెంచుతుంటాడు అక్ష‌య్. అయితే తాజాగా త‌న కూతురి స‌ర‌దా ఈ హీరోని ఉలిక్కి ప‌డేలా చేసింది. ఆ విష‌యాన్ని తన ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘డ్యాడీ డేఅవుట్‌ బెడిసికొట్టింది’ అని కామెంట్ పెట్టాడు. మేట‌ర్ లోకి వెళితే అక్ష‌య్, ట్వింకిల్ ఖ‌న్నా దంప‌తుల‌కి ఆర‌వ్, నిటారా అనే ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. వారితో ఎక్కువ స‌మ‌యం గ‌డిపేందుకు అక్ష‌య్ ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతుంటాడు. ప్ర‌స్తుతం ట్వింకిల్ విహార యాత్ర‌లో ఉండ‌డం, కుమార్ ఆర‌వ్ చ‌దువుల కోసం అమెరికా వెళ్ళ‌డంతో నిటారా బాధ్య‌త‌ని అక్ష‌యే చూసుకుంటున్నాడు. సండే రోజు త‌న కూతురిని స‌ర‌దాగా ఊయ‌ల ఎక్కించి ఆడిస్తున్న అక్ష‌య్ కి అనుకోని సంఘ‌ట‌న ఎదురైంది. పాపని ఊయ‌ల ఎక్కించి ఊపుతూ ఎదురుగా నిలుచున్న అక్ష‌య్ కి పాప కాళ్ళు స‌డెన్ గా వ‌చ్చి తగిలాయి. దీంతో ఒక్క‌సారి ఉలిక్కి ప‌డి వెన‌క్కి వెళ్ళాడు. కాస్త అయితే క్రింద ప‌డేవాడు కూడా. ఈ స‌ర‌దా వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. అక్షయ్‌ ప్రస్తుతం ఆయన ‘గోల్డ్‌’, ‘టాయ్‌లెట్‌: ఏక్‌ ప్రేమ్‌ కథా’, ‘ప్యాడ్‌మ్యాన్‌’చిత్రాల్లో నటిస్తున్నారు.3379
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles