బ‌ట్ట‌త‌ల రూమ‌ర్‌పై స్పందించిన అక్ష‌య్

Thu,January 18, 2018 03:00 PM
akshay clears the rumors

పాత్ర కోసం ఎన్ని ప్ర‌యోగాలైన చేసేందుకు రెడీగా ఉండే వారిలో బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ ఒక‌రు. వైవిధ్యమైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ వ‌స్తున్న అక్ష‌య్ గ‌త ఏడాది ఏకంగా నాలుగు సినిమాలు చేసి అందరికి షాక్ ఇచ్చాడు . ఇక ఈ ఏడాది జనవరి 25న ప్యాడ్ మాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇండోర్ ప్రాంతంలో శానిటరీ ప్యాడ్స్ పై మ‌హిళల్లో అవగాహన కల్పించేందుకు ఓ జంట పడ్డ శ్రమను ఈ చిత్రం ద్వారా చూపిస్తున్నారు. ఇక కేసరి అనే చారిత్రాత్మక చిత్రంతో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాడు అక్షయ్. బ్రిటీష్ ఇండియన్ బృందాలకు, ఆఫ్ఘనిస్థాన్ బృందాలకు మధ్య జరిగిన సరాగర్హి యుద్ధం నేపథ్యంలో ఈ కథ నడవనుంది. అనురాగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ సిక్కుగా కనిపించనున్నాడని ఇటీవ‌ల విడుద‌లైన‌ పోస్టర్ ద్వారా తెలుస్తుంది.

జ‌న‌వ‌రి 25న విడుద‌ల కానున్న ప్యాడ్‌మాన్ మూవీ కోసం ప‌లు ప్ర‌మోష‌న్స్ చేస్తున్నాడు అక్ష‌య్‌. అయితే ఈ కార్య‌క్ర‌మాల‌లో ఈ ఖిలాడీ యాక్ట‌ర్ బ‌ట్ట‌త‌ల‌తో క‌నిపించ‌డం అంద‌రిలో అనేక అనుమానాలు క‌లిగించింది. కొంద‌రు దీనిపై రూమార్స్ కూడా పుట్టించారు. కృత్రిమ జుట్టు కోసం చేయించుకున్న ఆపరేషన్‌ వికటించడం వ‌ల‌న ఇక మీద‌ట తాను బట్టతలతోనే కొనసాగాలని నిర్ణయించుకున్నాడ‌ని ఓ ఇంగ్లీష్ దిన‌ప‌త్రిక ఇటీవ‌ల ప్ర‌చురించింది. దీనిపై ఓ టీవీ షో ద్వారా పూర్తి క్లారిటీ ఇచ్చాడు అక్ష‌య్. ‘‘కేసరి చ్రితంలో పాత్ర కోసం తలపై పెద్ద పాగా ధరించాల్సిన అవసరం ఉంది. అది ఇబ్బందికరంగా ఉండటంతోనే ఇలాంటి హెయిర్‌ స్టైల్‌ కొనసాగిస్తున్నా.. అంతేతప్ప వేరే కారణం ఏదీ లేదు’’ అని అక్షయ్‌ స్పష్టత ఇచ్చేశాడు. మొత్తానికి అక్ష‌య్ క్లారిటీతో రూమ‌ర్స్‌కి బ్రేక్ ప‌డింది. కేస‌రి చిత్రాన్ని కరణ్‌ జోహర్‌-అక్షయ్‌ కుమార్ సంయుక్తంగా నిర్మించ‌నుండ‌గా ఇందులో ప‌రిణితీ చోప్రా క‌థానాయిక‌గా న‌టిస్తుంది.

2073
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles