అక్కినేనిగా సుమంత్ మారిన తీరు - వీడియో

Sat,January 12, 2019 10:30 AM

స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు జీవిత నేప‌థ్యంలో క్రిష్ తెర‌కెక్కించిన చిత్రం ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు. బాలకృష్ణ, విద్యాబాల‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఇందులోని పాత్ర‌లకి మంచి అప్లాజ్ వ‌చ్చింది. ప్ర‌తి ఒక్క‌రు త‌మ త‌మ పాత్ర‌ల‌లో జీవించారు. ముఖ్యంగా సుమంత్ త‌న తాత‌య్య అక్కినేని నాగేశ్వ‌ర‌రావు క్యారెక్ట‌ర్‌లో ఒదిగిపోయి ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించారు. వెండితెర‌పై సుమంత్‌ని చూస్తుంటే అచ్చం ఏఎన్ఆర్‌ని చూసిన‌ట్టుంద‌ని అభిమానులే కాదు ప్ర‌ముఖులు ప్ర‌శంస‌లు కురిపించారు. ఇందుకు సుమంత్ త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా .. త‌న ప‌నితీరుని ప్ర‌శంసించిన ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు తెలిపాడు. బాలకృష్ణ గారికి, క్రిష్‌ గారికి, మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు’ అని కామెంట్ చేశారు. దీనిని రీ ట్వీట్ చేసిన క్రిష్ థ్యాంక్యూ నాగేశ్వ‌ర‌రావు గారు అని ట్వీట్ చేస్తూ.. సుమంత్ త‌న తాతయ్య‌గా మారిన మేకింగ్ వీడియో షేర్ చేశాడు. ఇది అభిమానుల‌ని అల‌రిస్తుంది. చిత్రంలో నారా చంద్రబాబు నాయుడుగా రానా, హరికృష్ణగా కల్యాణ్‌రామ్, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్‌, జయప్రదగా హన్సిక, జయసుధగా పాయల్‌ రాజ్‌పుత్‌, శ్రీదేవిగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సావిత్రిగా నిత్యా మేనన్‌, ప్రభగా శ్రియ కనిపించారు. ఈ సినిమా రెండో భాగం ‘మహానాయకుడు’ ఫిబ్రవరి 7న విడుదల కాబోతోంది.


4971
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles