అఖిల్ సినిమాలో యాక్షన్ సీన్స్ ఖర్చెంతో తెలుసా ?

Wed,June 7, 2017 03:24 PM
akkineni nagarjuna paid huge amount for action scenes

తొలి సినిమాతో పరాజయాన్ని చవి చూసిన అఖిల్ రెండో సినిమాకు పక్కా స్క్రిప్ట్ తో రంగంలోకి దిగాడు.. వరుస విజయాలతో మంచి జోష్ లో ఉన్న విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రం తాజాగా తొలి షెడ్యూల్ పూర్తి చేసుకొని రెండో షెడ్యూల్ కి సిద్ధమైంది. తొలి షెడ్యూల్ లో భారీ యాక్షన్ సన్నివేశాలను విదేశీ ఫైట్ మాస్టర్స్ పర్యవేక్షణలో తెరకెక్కించారు. మెట్రో ట్రైన్ లోను .. మెట్రో స్టేషన్ లోను .. ఫుడ్ గోడౌన్ లో ఈ సీన్స్ షూట్ చేసినట్టు తెలుస్తుండగా, వీటికి 12 కోట్ల వరకు ఖర్చు చేశారనే టాక్ నడుస్తుంది. నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక అఖిల్ సరసన కథానాయికగా మేఘ ఆకాశ్ నటిస్తుందని వార్తలు వస్తున్నప్పటికి దీనిపై క్లారిటీ లేదు.


1047
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles