వైర‌ల్‌గా మారిన అక్కినేని ఫ్యామిలీ ఫోటో

Thu,June 20, 2019 08:51 AM
Akkineni family pic goes viral

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ప్ర‌త్యేక‌త‌ని సంత‌రించుకున్న కుటుంబాల‌లో అక్కినేని కుటుంబం ఒక‌టి. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు వెండితెర‌పై విభిన్న పాత్ర‌ల‌లో న‌టిస్తూ అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందారు. న‌ట‌సామ్రాట్‌గా అభిమానుల గుండెల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. ఆయ‌న వార‌సత్వాన్ని పుణికి పుచ్చుకున్న నాగార్జున ప్రేమ క‌థా చిత్రాలే కాక భ‌క్తిర‌స చిత్రాల‌లో న‌టించి తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకున్నాడు. ఇక అక్కినేని ఫ్యామిలీకి చెందిన నాగ చైత‌న్య‌, అఖిల్ , సుశాంత్ హీరోలుగా వెండితెర‌పై రాణిస్తున్నారు. ఇక ఇటీవ‌ల చైతూని వివాహం చేసుకొని అక్కినేని కోడలిగా మారింది స‌మంత‌. ఇలా అక్కినేని ఫ్యామిలీకి చెందిన వారు చాలా మంది సినీ రంగంలో రాణిస్తూ ఉన్నారు. రీసెంట్‌గా ఈ ఫ్యామిలీ అంతా ఓ సంద‌ర్భంలో క‌లిసారు. ఓ గ్రూప్ ఫోటోకి ఫోజులిచ్చారు. ఈ ఫోటోని సుశాంత్ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేయ‌గా, ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతుంది. అయితే ఈ ఫ్యామిలీ ఫోటోలో కొంద‌రు మిస్ అయ్యారంటూ సుశాంత్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నాడు.

4884
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles