టాలీవుడ్ లో మరో బయోపిక్.. ఆర్భాటాలు లేకుండా జరుగుతున్న వర్క్

Tue,April 24, 2018 03:39 PM
akkineni biopic goes on floors very soon

ఇన్నాళ్ళు బాలీవుడ్ లో బయోపిక్ ల హవా నడవగా, ఇప్పుడు టాలీవుడ్ లోను ఇదే పంథా సాగుతుంది. ఇప్పటికే సావిత్రి జీవిత నేపథ్యంలో బయోపిక్ ని రూపొందించి మే 9న విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు నిర్మాతలు. ఇక బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ జీవిత నేపథ్యంలో ఎన్టీఆర్ అనే పేరుతో సినిమా చేశాడు. ఈ సినిమా మేలో సెట్స్ పైకి వెళ్ళనుంది. మరోవైపు దివగంత రాజకీయ నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత నేపథ్యంలో యాత్ర అనే టైటిల్ తో బయోపిక్ రూపొందుతుంది. ఈ పరంపరలో స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు జీవిత నేపథ్యంలో సినిమా చేయనున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది.

తెలుగు తెరపై చెరగని ముద్ర వేసుకున్న నటులలో ఏఎన్ ఆర్ ఒకరు. ఆయన జీవితంపై సినిమా తీసేందుకు అక్కినేని ఫ్యామిలీ లోలోపల కసరత్తులు చేస్తుందట. ఆయన ప్రస్థానం పూర్తిగా వెండితెరపై చూపించేలా అన్నపూర్ణ ఫిలిం స్కూల్ స్టూడెంట్స్ కు ఈ బృహత్తర కార్యాన్ని అప్పగించినట్లు టాక్. కొన్ని నెలల క్రితమే రీసెర్చ్ మొదలు పెట్టిన వారు తమ పరిశోధన పత్రాలని డ్రాఫ్టింగ్ చేస్తున్నారట. వీటి ఆధారంగా పెద్దాయన జీవితంపై ఫైనల్ స్క్రిప్ట్ ప్రిపేర్ చేస్తారట. అక్కినేని బాల్యం నుండి అంతిమయాత్ర వరకు సినిమాలో చూపిస్తారట. యంగ్ అక్కినేనిగా చైతూ కనిపిస్తాడని తెలుస్తుండగా, వయసు మీద పడిన పాత్రని నాగార్జున చేయనున్నాడని సమాచారం. మరి దీనిపై పూర్తి క్లారిటీ రావలసి ఉంది.

2749
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS

Namasthe Telangana Property Show

Featured Articles