లండన్‌లో అఖిల్ సినిమా షూటింగ్

Fri,June 22, 2018 05:55 PM
Akkineni akhil, venky atluri team landed in london

టాలీవుడ్ యువ నటుడు అక్కినేని ‘హలో’ తర్వాత మూడో చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలిప్రేమ డైరెక్టర్ వెంకీ అట్లూరీ దర్శకత్వంలో మూడో సినిమా చేస్తున్నాడు అఖిల్. ఈ చిత్ర షూటింగ్ నేడు లండన్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైంది. సినిమా షూటింగ్ కోసం లండన్‌లో ల్యాండ్ అయినట్లు వెంకీ అట్లూరీ, అఖిల్ అండ్ టీం సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది.

లొకేషన్‌లో అఖిల్, నిధి అగర్వాల్, వెంకీ అట్లూరి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. అఖిల్ 3 అనే హ్యాష్‌టాగ్‌తో ఉన్న పోస్టర్‌ను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఈ సినిమాలో విద్యుల్లేఖారామన్ కీలక పాత్రలో నటిస్తోంది. వరుణ్‌తేజ్, రాశీఖన్నా కాంబినేషన్‌లో వెంకీ అట్లారీ దర్శకత్వం వహించిన తొలిప్రేమ చిత్రం బాక్సాపీస్ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.
1282
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS