పవన్- అన్నా మధ్యలో రేణూ తనయుడు .!

Fri,June 22, 2018 04:10 PM
akira with pawan , pic goes viral

రేణూ దేశాయ్ నుండి విడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ అన్నా లెజోనావాని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకి ఓ పాప, ఓ బాబు ఉన్నారు. అంతకముందు రేణూ దేశాయ్,పవన్ కళ్యాణ్ దాంపత్యంలో అకీరా, ఆద్య అనే ఇద్దరు చిన్నారులు ఉన్న సంగతి తెలిసిందే. రేణూ నుండి విడిపోయిన తర్వాత పవన్ అప్పుడప్పుడు పూణే వెళ్ళి చిన్నారులతో సరదాగా గడుపుతూ వస్తున్నారు. అకీరా ప్రస్తుతం పవన్ తోనే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ మధ్య చరణ్ బర్త్ డేకి పవన్ చిరు ఇంటికి వెళ్లగా ఆ రోజు తన తనయుడిని కూడా తీసుకొని వెళ్ళాడు. చరణ్ , పవన్ , చిరు,అకీరా, సురేఖ కలిసి ఫోటోలు కూడా దిగారు. ఈ ఫోటోలని అకీరా బర్త్ డేకి చరణ్ రివీల్ చేశాడు.

కొన్నాళ్ళ నుండి రాజకీయ యాత్రతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇటీవల యాత్రకి షార్ట్ బ్రేక్ ఇచ్చాడు. కంటి ఇన్ఫెక్షన్ కారణంగా వాయిదా వేసిన పవన్ ఇటీవల విజయవాడలో కంటికి సర్జరీ కూడా చేయించుకున్నాడట. ఆ సమయంలో పవన్ తో పాటు ఉండేందుకు అకీరా పూణే నుండి డైరెక్ట్ గా విజయవాడ వచ్చాడని తెలుస్తుంది. అయితే పవన్ ని ఓ హోటల్ రూం నుండి కారు దగ్గరకి తీసుకొచ్చే సమయంలో తన కుమారుడిని ఎత్తుకొని ఉన్న అన్నా లెజీనోవా, అకీరా కనిపించారు. ఈ సన్నివేశాన్ని ఎవరో తమ కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ పిక్ వైరల్ గా మారింది. తమ కుమారుడు అకీరా నందన్ ను జూనియర్ పవర్ స్టార్ అంటూ పిలవద్దంటూ అకీరా చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రేణూ తన పిల్లలతో గోవా టూర్ వేస్తుంది.

ఇక ఇంతకాలం హైదరాబాద్ లో ఉంటూ రాజకీయాల్ని నడిపిన పవన్ రీసెంట్ గా విజయవాడలో అద్దె ఇంటిని తీసుకొని అందులోకి షిఫ్ట్ అయ్యాడు . విజయవాడలోని పడమటలో ఇంటిని అద్దెకు తీసుకున్న ఆయన.. శుక్రవారం ఉదయం గృహప్రవేశం చేశారు. ఇక ఇక్కడ నుండే తన పార్టీ కార్యక్రమాలు కొనసాగించనున్నాడు.

5617
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS