నాగ్ భక్తిరస చిత్రం తమిళ ట్రైలర్ విడుదల

Mon,December 18, 2017 03:14 PM
Akilandakodi Brahmandanayagan Official Trailer

తెలుగు సినిమాల మార్కెట్ రోజు రోజుకి పెరుగుతున్న నేపధ్యంలో ఇప్పుడు మరో తెలుగు చిత్రం కోలీవుడ్ లో రిలీజ్ కి రెడీ అయింది. హథీరామ్ బావాజీ జీవిత నేపథ్యంలో తెరకెక్కిన ఓం నమో వెంకటేశాయ చిత్రం తమిళంలో అఖిలాండ కోడి బ్రహ్మాండనాయగన్ అనే టైటిల్ తో విడుదల కానుంది. హథీరామ్ బావాజీ గురించిన చరిత్ర తమిళ ప్రజలకు బాగా తెలుసట. అందువలన ఈ సినిమాను అనువాదం చేసి అక్కడ విడుదల చేస్తే బాగుంటుందని నిర్మాతలు అనుకున్నారు. ఈ క్రమంలోనే ఓం నమో వెంకటేశాయ చిత్రంని కూడా తమిళంలో విడుదల చేస్తున్నారు. ఇక ఇటీవల ఈ చిత్ర పోస్టర్స్ విడుదల చేసిన టీం రీసెంట్ గా ట్రైలర్ విడుదల చేసింది. ఆ ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి. రాఘవేంద్రరరావు దర్శకత్వంలో ఓం నమో వెంకటేశాయ చిత్రం తెరకెక్కగా, అనుష్క, ప్రగ్యా జైస్వాల్ ఇందులో కీలక పాత్ర పోషించారు . ఇదివరకు నాగ్ నటించిన కొన్ని సినిమాలు తమిళంలో విడుదల కాగా, 2015లో వచ్చిన ఇంజి ఇదుప్ప జగి అనే తమిళ మూవీలో నాగ్ ఓ చిన్న పాత్ర వేయడం విశేషం.

2153
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles