అఖిల్ స‌ర‌స‌న నితిన్ బ్యూటీ..!

Thu,March 29, 2018 12:24 PM
akhil romance with megha akash

అక్కినేని అఖిల్ ఇటీవ‌ల హ‌లో చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా విజ‌యం సాధించ‌లేక‌పోయింది. దాంతో త‌దుప‌రి సినిమాపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బరుస్తున్నాడు అఖిల్‌. తొలిప్రేమ వంటి బ్యూటీ ఫుల్ ల‌వ్ స్టోరీతో ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని అందించిన వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో త‌న మూడో సినిమా చేయ‌నున్నాడు అఖిల్‌. ఈ సినిమా ఇటీవ‌ల పూజా కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకొని త్వ‌ర‌లో సెట్స్‌పైకి వెళ్ళేందుకు సిద్ధ‌మైంది. త‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం కోసం హీరోయిన్‌గా ఎవ‌రిని తీసుకోవాలా అని మేక‌ర్స్ భావిస్తున్నారు. లై చిత్రంతో పాటు ఛ‌ల్ మోహ‌న్ రంగా చిత్రంలోను నితిన్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టించిన‌ మేఘా ఆకాశ్ అయితే బాగుంటుంద‌ని అనుకుంటున్నార‌ట‌. త్వ‌ర‌లోనే దీనిపై ఓ క్లారిటీ ఇవ్వ‌నున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌ పై బీవీయస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమాతో ఎలాగైన కమర్షియల్‌ హీరోగా పేరు తెచ్చుకోవాల‌ని భావిస్తున్న అఖిల్ నాలుగో సినిమాగా వ‌ర్మ డైరెక్ష‌న్‌లో ఓ మూవీ చేయ‌నున్నాడు.

2858
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles