అక్కినేని నాగార్జున వారసుడు అఖిల్ తన తొలి చిత్రంగా వివి వినాయక్ దర్శకత్వంలో అఖిల్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా అభిమానులని నిరాశపరచింది. ఆ తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేసిన హలో కూడా అంతగా ఆదరణ దక్కించుకోలేకపోయింది. ఈ సారి ఎలా అయిన మంచి హిట్ కొట్టాలనే కసితో తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో మిస్టర్ మజ్నూ అనే చిత్రం చేస్తున్నాడు అఖిల్. ఈ సినిమాపై అభిమానులలో భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా అఖిల్ ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు. చిత్రం యొక్క ప్యాచ్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. ఒక్క సాంగ్ మినహా చిత్ర షూటింగ్ అంతా డిసెంబర్ 3 వరకు పూర్తవుతుంది. చిత్రాన్ని జనవరిలో తప్పక విడుదల చేస్తాం. ఇన్ని రోజులుఎంతో ఓపికగా ఉన్న అభిమానులకి ధన్యవాదాలు అని తన ట్వీట్లో తెలిపాడు అఖిల్. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా, ఎస్విసిసి పతాకం ఫై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో విద్యుల్లేఖారామన్ కీలక పాత్రలో కనిపించనుంది.