వ‌దిన కోసం డ్యాన్స్ చేసిన అఖిల్‌

Fri,September 7, 2018 12:10 PM
akhil dance for samantha u turn movie

నాగ చైత‌న్య‌ని వివాహం చేసుకున్న త‌ర్వాత స‌మంత అక్కినేని కోడ‌లిగా మారిన సంగ‌తి తెలిసిందే. సౌత్‌లో టాప్ హీరోయిన్‌ల‌లో ఒకరిగా ఉన్న స‌మంత త‌న కుటుంబ స‌భ్యుల‌తో మాత్రం చాలా హుందాగా వ్య‌వ‌హ‌రిస్తుంటుంది. ముఖ్యంగా అఖిల్‌తో చాలా స‌ర‌దాగా ఉంటుంది. అయితే ఆమె న‌టించిన యూట‌ర్న్ చిత్రం సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల కావ‌ల‌సి ఉంది. క‌న్న‌డ రీమేక్‌గా ప‌వ‌న్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందింది. ఇటీవ‌ల చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా అనిరుధ్ స్వ‌ర‌ప‌రచిన క‌ర్మ థీమ్ అనే స్పెష‌ల్ సాంగ్ విడుద‌ల చేశారు. ఈ సాంగ్‌కి హ్యూజ్ రెస్పాన్స్ వ‌స్తుంది. పిల్ల‌లు, పెద్దలు అనే తేడా లేకుండా ప్ర‌తి ఒక్కరు ఈ సాంగ్‌లో స‌మంత స్టెప్పుల‌ని అనుక‌రిస్తూ డ్యాన్స్‌లు చేసి వీడియోల‌ని సోష‌ల్ మీడియాలో చేస్తున్నారు . స‌మంత మ‌రిది అఖిల్ కూడా త‌న వదిన స్టెప్పుల మాదిరిగా తాను డ్యాన్స్ చేసి ఈ వీడియోని మా వ‌దిన కోసం అనే కామెంట్‌తో పోస్ట్ పెట్టాడు. అంతేకాక త‌న వ‌దిన‌కు అడ్వాన్స్ విషెస్ తెలియ‌జేశాడు. స‌మంత న‌టించిన యూ ట‌ర్న్ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం ఫై శ్రీనివాస్ చిట్టూరి నిర్మించాడు. ఈచిత్రానికి పూర్ణ చంద్ర తేజస్వి సంగీతం అందిస్తున్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల‌లో విడుద‌ల కానున్న ఈ సినిమాకి స‌మంత ఓన్ డ‌బ్బింగ్ చెప్పుకోవ‌డం విశేషం.

View this post on Instagram

You were so good Vaishnavi ❤️ #UTurnDanceChallenge

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

View this post on Instagram

Okay I am dead 😭😭😭 too adorable #UTurnDanceChallenge

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

5138
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles