గాసిప్ రాయుళ్ల‌ని ఫూల్స్ చేసిన అఖిల్‌

Fri,July 13, 2018 11:24 AM
akhil and his director special video goes viral

సినీ సెల‌బ్రిటీలు ఎక్కువ‌గా లైమ్ లైట్‌లో ఉంటున్న కార‌ణంగా జ‌నాల దృష్టి వారిపై ఉండ‌డం స‌హజం. అయితే కొందరు గాసిప్ రాయుళ్ళు వారి ప్రొఫెష‌న‌ల్ లైఫ్‌తో పాటు ప‌ర్స‌న‌ల్ లైఫ్‌కి సంబంధించిన వార్త‌ల‌ని జోరుగా ప్ర‌చారం చేస్తుంటారు. దీనిపై కొంద‌రు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తుండ‌గా, మ‌రి కొంద‌రు లైట్ తీసుకుంటుంటారు. అయితే తాజాగా అఖిల్ సినిమాకి సంబంధించి ఓ వార్త ఫిలిం న‌గ‌ర్‌లో జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. అఖిల్ ప్ర‌స్తుతం వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో త‌న మూడో సినిమా చేస్తుండగా ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయని అన్నారు. స్క్రిప్టులో వెంకీ మార్పులు చేయ‌డంతో అఖిల్‌ రెండురోజులు షూటింగ్‌కు రాలేద‌ని గాసిప్స్‌ వచ్చాయి. అంతేకాదు సినిమా కూడా ఆగిపోయే చాన్స్ ఉంద‌ని విప‌రీతంగా రూమ‌ర్స్ సృష్టించారు మ‌న గాసిప్ రాయుళ్ళు. దీంతో వాళ్ళ‌ని ఫూల్స్ చేసేందుకు అఖిల్‌, ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి ఓ వీడియో రూపొందించారు. ఇందులో మీరే డైరెక్టురుగా.. ముందుగా మీరే మాట్లాడండి.. మీరు హీరోగా మీరే మాట్లాడండి అంటూ ఇరువురు నిజంగానే గొడవ పడుతున్నట్లు చేశారు. కాని త‌ర్వాత బిగ్గ‌ర‌గా న‌వ్వుతూ గాసిప్ రాయుళ్ళ‌ని ఫూల్స్ చేశారు. ఆ ఆనందంలో ద‌ర్శ‌కుడికి ముద్దిచ్చి పారిపోయాడు అఖిల్‌ . ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్ అయింది.

1920
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS