అఫీషియ‌ల్: తొలి ప్రేమ డైరెక్ట‌ర్‌తో అక్కినేని హీరో సినిమా

Sun,March 18, 2018 10:21 AM
Akhil Akkineni, Venky Atluri team up for new movie

అక్కినేని మూడోత‌రం వార‌సుడు అఖిల్ ఇటీవ‌ల హ‌లో చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. విక్ర‌మ్ కుమార్ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సంపాదించుకున్న‌ప్ప‌టికి, కలెక్ష‌న్స్ విష‌యంలో డీలా ప‌డింది. ఈ క్ర‌మంలో త‌న త‌దుపరి సినిమాపై ప్ర‌త్యేక ఆస‌క్తి క‌న‌బరుస్తున్నాడు అఖిల్‌. ఇటీవ‌ల తొలి ప్రేమ అనే రొమాంటిక్ చిత్రంతో బాక్సాఫీస్‌ని షేక్ చేసిన ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి. సింపుల్ ల‌వ్ స్టోరీగా రూపొందించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నాడు వెంకీ. ఇప్పుడు ఈ ద‌ర్శ‌కుడితోనే అఖిల్ త‌న మూడో సినిమా చేయబోతున్నాడు. ఈ విష‌యాన్ని కొద్ది సేప‌టి క్రితం త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు అఖిల్‌. మే నుండి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ల‌నున్న‌ట్టు తెలుస్తుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివియస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి మిగ‌తా వివ‌రాలు వెల్ల‌డించ‌నున్నారు.3367
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles