అఖిల్ సినిమాకి హీరోయిన్ స‌మ‌స్య‌..!

Tue,April 16, 2019 12:06 PM
Akhil Akkineni movie gets problems

అక్కినేని నాగార్జున త‌న‌యుడు అఖిల్‌కి స‌క్సెస్ అనేది అంద‌ని ద్రాక్ష‌గానే మారింది. ఇప్ప‌టికే మూడు సినిమాలు చేసిన అఖిల్‌కి మంచి హిట్ ఒక్క‌టి రాలేదు. త్వ‌ర‌లో 'మలుపు’ ఫేమ్ సత్య ప్ర‌భాస్‌( ఆదిపినిశెట్టి సోద‌రుడు) తో ఓ చిత్రం చేయ‌నున్నాడు అఖిల్. ఈ చిత్రం క్రీడా నేప‌థ్యంలో ఉంటుంద‌ట‌. మ‌రోవైపు బ‌డా నిర్మాణ సంస్థ‌ల‌లో ఒక‌టైన గీతా ఆర్ట్స్‌లో అఖిల్ ఓ సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని బొమ్మ‌రిల్లు భాస్కర్ తెర‌కెక్కించ‌నున్నార‌ని అంటున్నారు. అయితే బొమ్మ‌రిల్లు భాస్కర్ ఇప్ప‌టికే స్క్రిప్ట్ సిద్దం చేసి అఖిల్‌కి వినిపించ‌గా, అది ఆయ‌న‌కి ఎంత‌గానో న‌చ్చ‌డంతో వెంట‌నే ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ‌దామ‌ని అన్నాడ‌ట‌. అయితే ఈ చిత్రానికి హీరోయిన్ స‌మ‌స్య ఇబ్బందిగా మారిందని అంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా కీల‌కం కాగా, ప‌ర్‌ఫెక్ట్‌గా హావభావాలు ప‌లికించే హీరోయిన్ కోసం వెతుకులాట‌లో చిత్ర బృందం ఉంద‌ట‌. యంగ్ హీరోయిన్స్ దొర‌క‌ని ప‌క్షంలో సీనియ‌ర్ హీరోయిన్‌తోనే సినిమా తెర‌కెక్కించాల‌ని చిత్ర బృందం భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది.

1260
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles