త‌మిళ స్టార్ హీరోని డిన్న‌ర్‌కి ఆహ్వానించిన అఖిల్

Wed,October 16, 2019 12:15 PM

వ‌రుస ఫ్లాపుల‌తో ఇబ్బంది ప‌డుతున్న అఖిల్ ప్ర‌స్తుతం బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న నాలుగ‌వ చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే . ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బేన‌ర్‌పై బ‌న్నీ వాసు నిర్మిస్తున్నాడు. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. గోపి సుంద‌ర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుంది. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం అతి త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే గ‌త రాత్రి త‌మిళ హీరో శివ‌కార్తికేయ‌న్‌, ద‌ర్శ‌కుడు మిత్ర‌న్, జార్జిల‌ని హైద‌రాబాద్‌లో త‌న ఇంటికి డిన్న‌ర్‌కి ఆహ్వానించాడు అఖిల్‌. ఆ త‌ర్వాత క‌లిసి ఫోటోలు దిగారు. ఆ ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. కాగా, శివ‌కార్తికేయ‌న్, మిత్ర‌న్ కాంబినేష‌న్‌లో చిత్రం రూపొందుతున్న‌ట్టు తెలుస్తుంది.

2123
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles