హీరో కారు చేజ్ చేసి మ‌రీ సెల్ఫీ దిగిన అభిమాని

Wed,November 14, 2018 08:24 AM
ajith warns to his fan

త‌ల అజిత్‌కి త‌మిళంలోనే కాదు తెలుగులోను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. త‌మిళంలో రజనీ, కమల్‌ హాసన్‌, విజయ్‌ల తర్వాత అంతటి ఫ్యాన్‌ పాలోయింగ్‌ ఉన్న స్టార్‌ హీరో అజిత్‌. ఆయ‌న సినిమాల కోసం అభిమానులు క‌ళ్ళ‌ల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తుంటారు. ఇక ఛాన్స్ దొరికితే అజిత్‌ని క‌ల‌వాల‌ని ఆయ‌న‌తో క‌లిసి సెల్ఫీ దిగాల‌ని అభిమానులు క‌లలు కంటుంటారు. ఇటీవ‌ల అజిత్ చెన్నైలోని ప్ర‌ముఖ స్టూడియోలో డ‌బ్బింగ్ చెప్పేందుకు వెళ్ల‌గా, ఆయ‌న వ‌చ్చాడ‌ని తెలుసుకున్న అభిమానులు రాత్రంతా స్టూడియో గేట్ ముందు ప‌డిగాపులు కాశార‌ట‌. ఈ విష‌యంలో అజిత్ వారికి చుర‌క‌లంటించి, ఇంకోసారి ఇలా చేయోద్దంటూ వార్నింగ్ ఇచ్చి ఇంటికి పంపాడ‌ట‌. ఇక తాజాగా ఓ అభిమాని అజిత్‌ని క‌లిసేందుకు దాదాపు 18 కిలోమీట‌ర్లు ఆయ‌న కారుని వెంబ‌డించి చివ‌రికి సెల్ఫీతో ఆనందం పొందాడు

అజిత్ రీసెంట్‌గా త‌న కారులో ఎయిర్‌పోర్ట్‌కి వెళుతుండ‌గా, గ‌ణేష్ అనే అభిమాని కంట‌ప‌డ్డాడు. ఎలా అయిన త‌న అభిమాన హీరోని క‌ల‌వాల‌నుకొని అజిత్ కారు చేజ్‌ చేశాడ‌ట‌. ఈ విష‌యం గ‌మ‌నించిన అజిత్ కారు ఆపి త‌న‌తో మాట్లాడి, ఇంకోసారి ఇలాంటి ప‌నులు చేయోద్ద‌ని సూచించిన‌ట్టు గ‌ణేష్ సోష‌ల్ మీడియాలో తెలిపాడు. ఇలా చేసినందుకు క్ష‌మించ‌మ‌ని గ‌ణేష్ కోరిన‌ట్టు కూడా పేర్కొన్నాడు. అజిత్ ప్ర‌స్తుతం శివ ద‌ర్శ‌క‌త్వంలో విశ్వాసం అనే సినిమా చేస్తుండ‌గా, ఈ సినిమా అతి త్వ‌రలోనే విడుద‌ల కానుంది. ఈ మూవీపై అభిమానుల‌లో భారీ అంచ‌నాలున్నాయి.

3299
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles