విశ్వాసం నుండి అజిత్ న్యూ లుక్ విడుద‌ల‌

Thu,October 25, 2018 11:54 AM
ajith new look released

త‌ల అజిత్‌కి త‌మిళంలోనే కాదు తెలుగులోను ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు. ప్ర‌స్తుతం అజిత్ .. ద‌ర్శ‌కుడు శివ ద‌ర్శ‌క‌త్వంలో విశ్వాసం అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాలో అజిత్ స‌ర‌స‌న లేడి సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తుంది. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేయాల‌ని భావిస్తుండ‌గా, మేక‌ర్స్ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్స్ విడుద‌ల చేస్తూ సినిమాపై ఆస‌క్తిని క‌లిగిస్తున్నారు. తాజాగా అజిత్ లుక్‌కి సంబంధించి పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. బుల్లెట్‌పై హెల్మెట్ పెట్టుకొని వెళుతుండ‌గా, వెనుక ఉన్న గ్యాంగ్ స‌ర‌దాగా గంతులేస్తున్నారు. ఈ పోస్ట‌ర్ త‌మిళ తంబీల‌ని ఆక‌ట్టుకుంటుంది. గతంలో 'వి' అక్షరంతో తెర‌కెక్కిన‌ అజిత్ సినిమాలు వాలి .. విలన్ .. వీరం .. వేదాళం , వివేగం చిత్రాలు మంచి విజ‌యం సాధించ‌డంతో ఈ సినిమా కూడా భారీ విజ‌యం సాధిస్తుంద‌ని అంటున్నారు. మూవీలో అజిత్ డాన్‌గా క‌నిపించ‌నున్నాడ‌ట‌.

1577
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles