కెరీర్ లో భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్న స్టార్ హీరో

Wed,June 28, 2017 04:22 PM
ajith movie budjet is high

తల అజిత్ .. ఈ హీరోకి కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లోను ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ హీరో సినిమా కోసం అభిమానులు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూస్తున్నారు. శివ దర్శకత్వంలో అజిత్ హీరోగా వివేగం అనే మూవీ తెరకెక్కుతుండగా, ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్, టీజర్ ఫ్యాన్స్ లో చాలా ఆసక్తి కలిగించాయి. సెలబ్రిటీలు కూడా తల లుక్ పై ప్రశంసల వర్షం కురిపించారు. వివేగం చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకోగా త్వరలోనే మూవీ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వివేగం చిత్రం 120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుందట. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా అజిత్ కెరీర్ లో హైయస్ట్ బడ్జెట్ మూవీ అని అంటున్నారు . మూవీ రిలీజ్ త‌ర్వాత వివేగం 120 కోట్ల‌కి పైగా కలెక్ష‌న్స్ రాబ‌డుతుందా అనే దానిపై భారీ చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది.

1863
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles