అజిత్- బోనీ క‌పూర్ మూవీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Tue,March 5, 2019 09:12 AM
Ajith Looks Intense In  AK 59

త‌మిళ స్టార్ హీరో అజిత్ న‌టించిన తాజా చిత్రం విశ్వాసం ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఈ చిత్రానికి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని బాగా ఆద‌రిస్తున్నారు. ఇక ప్ర‌స్తుతం పింక్ రీమేక్‌తో బిజీగా ఉన్నాడు అజిత్‌. ఖాకీ ఫేం హెచ్ వినోథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా..బోనీకపూర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అజిత్‌కి 59వ చిత్రం కాగా, ఇందులో త‌మిళ నేటివిటీకి అనుగ‌ణంగా ప‌లు మార్పులు చేస్తున్న‌ట్టుగా తెలుస్తుంది.తాజాగా చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో అజిత్ కోట్ వేసుకొని సీరియ‌స్ లుక్‌లో క‌నిపిస్తుండ‌గా శ్ర‌ద్ధా శ్రీనాథ్‌, అభిరామి వెంక‌టచ‌లం, ఆండ్రియా తరియంగ్‌లు బోనులో నిల్చొని ఉన్నారు. ఒరిజిన‌ల్ వ‌ర్షెన్ పోస్ట‌ర్ మాదిరిగానే ఈ పోస్ట‌ర్‌ని రూపొందించి నెర్కొండ పార్వీ అనే టైటిల్‌తో త‌మిళ వర్షెన్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం రెండు పోస్ట‌ర్‌ల‌పైన సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తుంది. ఏ పోస్ట‌ర్ అట్రాక్టివ్‌గా ఉందంటూ చ‌ర్చ‌లు చేస్తున్నారు. విద్యా బాలన్ కూడా చిత్రంలో కీల‌క పాత్ర పోషించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఈ యువన్‌ శంకర్‌రాజా సంగీతం సమకూర్చుతున్నారు. నీరవ్‌షా సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించనున్నారు. అధిక్‌ రవిచంద్రన్‌, అర్జున్‌ చిదంబరం, అశ్విన్‌ రావు, సుజిత్‌ శంకర్‌ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు.
2098
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles