పొలిటిక‌ల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో

Tue,January 22, 2019 08:49 AM
ajith gives clarity on poilitical entry

పురుచ్చ‌త‌లైవి జ‌య‌ల‌లిత మ‌ర‌ణంతో ఏర్ప‌డిన రాజ‌కీయ సంక్షోభం ఇంకా స‌మ‌సిపోలేదు. రోజుకో మలుపు తిరుగుతూ ర‌స‌కందాయంలో ఉంది. ప‌లువురు ముఖ్య‌మంత్రి పీఠం ద‌క్కించుకునేందుకు క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. సినిమా రంగానికి సంబంధించిన ప‌లువురు స్టార్స్ కూడా ఎన్నిక‌ల‌లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. క‌మ‌ల్ హాస‌న్ ఇప్ప‌టికే త‌న పార్టీ పేరు ప్ర‌క‌టించి రాజ‌కీయాల‌లో పావులు క‌దుపుతున్నారు. ఇక ర‌జ‌నీకాంత్ కూడా త్వ‌ర‌లోనే రాజ‌కీయాల‌కి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేయ‌నున్నాడ‌ని అంటున్నారు. ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ కూడా రాజ‌కీయారంగేట్రం చేయ‌బోతున్నాడ‌ని వార్త‌లు రాగా, ఆ మ‌ధ్య వాటిని ఖండించాడు. ఇక ఇప్పుడు త‌ల అజిత్ వంతు వ‌చ్చింది. కొద్ది రోజులుగా అజిత్ రాజ‌కీయాలలోకి రాబోతున్న‌ట్టు జోరుగా ప్ర‌చారం చేశారు. దీనిపై పేప‌ర్ ప్ర‌క‌ట‌న ద్వారా క్లారిటీ ఇచ్చాడు అజిత్.

అజిత్ అన్నాడీఎంకేలోకి చేరుతున్న‌ట్టు వార్త‌లు రాగా అవ‌న్నీ అవాస్త‌వాలేనంటూ కొట్టి పారేశారు అజిత్‌. ప్ర‌త్య‌క్షంగా కాని , ప‌రోక్షంగా రాజకీయాల‌లో ఉండ‌డం లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. సినిమా అనేది నా వృత్తి. నేను కేవ‌లం సినిమాల‌కే ప‌రిమితమై ఉంటాను. ఇక అభిమానులు మీకు మీ అభిప్రాయం ఉంటుంది. దానిని నాపై రుద్దకండి. మిమ్మ‌ల్ని ఒక పార్టీకి ఓటేయ‌మ‌ని చెప్ప‌ను. మీకు న‌చ్చిన‌ట్టు మీరు చేయండి. నాకు సంబంధించి ఫ్యాన్స్ క్ల‌బ్ కూడా ఎత్తివేయ‌డం జ‌రిగింది. ఎవ‌రైన అభిమానుల సంఘం పేరుతో ర‌చ్చ చేస్తే క‌ఠిన చర్య‌లు త‌ప్ప‌వ‌ని అజిత్ వార్నింగ్ ఇచ్చారు. మీ మీ రంగాల‌లో రాణిస్తూ దేశ ప్ర‌గతికి దోహ‌ద‌ప‌డ‌వ‌ల‌సిందిగా అభిమానుల‌ని కోరారు అజిత్‌. రీసెంట్‌గా విశ్వాసం అనే చిత్రంతో అజిత్ ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన సంగ‌తి తెల‌సిందే.

1838
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles