అభిమానులకు ‘తల’ బర్త్ డే గిఫ్ట్

Tue,April 4, 2017 11:44 AM
ajith gifts to fans on his birthday

కోలీవుడ్ క్రేజీ ప్రాజెక్టులలో తల అజిత్ నటిస్తున్న వివేగం మూవీ ఒకటి. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అజిత్ ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం బల్గేరియాలో జరుగుతుండగా కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. మే 10తో ఇక్కడి షెడ్యూల్ పూర్తి కానుండగా, టీం వెంటనే ఇండియాకు బయలుదేరుతుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేయనుంది. అయితే మే 1 న అజిత్ బర్త్ డే ఉన్నందున అభిమానులకు గిఫ్ట్ గా టీజర్ ని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు . ఇప్పటికే వివేగమ్ చిత్రంకు సంబంధించి విడుదలైన లుక్స్ అభిమానులకే కాదు పలు ఇండస్ట్రీలకు చెందిన సెలబ్రిటీలు ముక్కున వేలేసుకునేలా చేసాయి. వివేక్ ఒబేరాయ్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం యూరప్ లో కూడా కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరుపుకుంది. కాజల్ అగర్వాల్, అక్షరా హాసన్‌ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ లో విడుదల చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.

1675
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles