అర్ధ‌రాత్రి అభిమానుల‌ ప‌డిగాపులు.. ఫైర్ అయిన హీరో

Tue,October 30, 2018 09:46 AM
ajith fire on fans

త‌ల అజిత్‌కి త‌మిళంలోనే కాదు తెలుగులోను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయ‌న సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు. ప్ర‌స్తుతం శివ ద‌ర్శ‌క‌త్వంలో విశ్వాసం అనే సినిమా చేస్తున్నాడు అజిత్‌. ఈ సినిమాకి సంబంధించి విడుద‌లైన లుక్స్ ఫ్యాన్స్‌లో ఆనందాన్ని రెట్టింపు చేశాయి. సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రం విడుద‌ల కానుంది. అయితే ఈ మూవీ ప్ర‌స్తుతం డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుండ‌గా, చెన్నైలోని ప్ర‌ముఖ స్టూడియోలో త‌న పాత్ర‌కి రాత్రంతా డ‌బ్బింగ్ చెప్పార‌ట అజిత్‌. త‌మ అభిమాన హీరో డ‌బ్బింగ్ స్టూడియోలో ఉన్నాడ‌ని తెలుసుకున్న ఫ్యాన్స్ అజిత్ కోసం రాత్రంతా స్టూడియో గేటు ముందే ప‌డిగాపులు కాశార‌ట‌. ఈ విష‌యం తెలుసుకున్న అజిత్ బ‌య‌ట‌కి వ‌చ్చి ఫ్యాన్స్‌కి వార్నింగ్ ఇచ్చాడ‌ట‌. నిద్ర వృధా చేసుకుంటూ ఇలా ఇక్క‌డ ఉండ‌డం త‌ప్పు. మీ కుటుంబ స‌భ్యుల‌కే ఎక్కువ స‌మ‌యం కేటాయించండి అంటూ అభిమానుల‌కి సూచ‌న‌లిచ్చాడంట‌. మ‌ళ్ళీ ఇలా ఎప్పుడు చేయోద్ద‌ని చెప్పి, వారితో సెల్ఫీలు దిగి ఇంటికి పంపించాడ‌ట‌.

3660
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles