ఫ్రాన్స్‌లో అజిత్ భారీ క‌టౌట్

Fri,January 4, 2019 09:06 AM

త‌మిళంలో అత్య‌ధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న న‌టుల‌లో త‌ల అజిత్ ఒక‌రు. ఆయ‌న న‌టించిన తాజా చిత్రం విశ్వాసం. జ‌న‌వ‌రి 10న విడుద‌ల కానున్న ఈ చిత్రంపై అభిమానుల‌లో భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. అయితే అజిత్‌కి దేశ విదేశాల‌లోను ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండ‌గా, విశ్వాసం లుక్‌కి సంబంధించిన ఓ భారీ క‌టౌట్ ఫ్రాన్స్‌లో ఏర్పాటు చేశారు ఆయ‌న అభిమానులు. ఇంత వ‌ర‌కు ఏ హీరోకి కూడా ఇంత భారీ క‌టౌట్ ఏర్పాటు చేయ‌లేద‌ని చెబుతున్నారు.


అజిత్ న‌టించిన విశ్వాసం చిత్ర ట్రైల‌ర్ రీసెంట్‌గా విడుద‌లైంది. ఇందులో స‌న్నివేశాలు అభిమానుల ఆనందానికి హ‌ద్దులు లేకుండా చేసాయి. జ‌గ‌ప‌తి బాబు, అజిత్ మ‌ధ్య యాక్ష‌న్ స‌న్నివేశాలు అద్భుతంగా ఉంటాయ‌ని ట్రైల‌ర్‌ని బ‌ట్టి అర్ధ‌మ‌వుతుంది. ఇక క‌థానాయికగా న‌టిస్తున్న న‌య‌న‌తార‌తో కెమిస్ట్రీ కూడా బాగానే వర్క్ అవుట్ అయింద‌నిపిస్తుంది. ఈ ట్రైలర్ లో గంటలో 34లక్షల రియల్ టైం వ్యూస్ సాధించింది . సత్య జ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం అజిత్‌కి మంచి హిట్ ఇస్తుంద‌ని టీం భావిస్తుంది. గతంలో 'వి' అక్షరంతో తెర‌కెక్కిన‌ అజిత్ సినిమాలు వాలి .. విలన్ .. వీరం .. వేదాళం , వివేగం చిత్రాలు మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే .

2452
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles