కోలీవుడ్ లో రజనీకాంత్, విజయ్, అజిత్ ఈ ముగ్గురు హీరోలకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులోను ఈ హీరోలని చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇక అజిత్ విషయానికి వస్తే చాలా సింపుల్ గా ఉండే ఈ హీరో పబ్లిక్ ఫంక్షన్స్ లో పెద్దగా కనిపించడు. కాని తాజాగా తన ఫ్యామిలీతో కలిసి ఓ వెడ్డింగ్ లో కనిపించి అందరికి షాక్ ఇచ్చాడు. అజిత్ తన భార్య శాలిని, కుమార్తె అనౌష్క కుమార్ తో కలిసి ఫోటోలకు కూడా ఫోజులిచ్చాడు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక అజిత్ సినిమా విషయానికి వస్తే శివ దర్శకత్వంలో వివేగం సినిమా చేస్తున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్ట్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు సమాచారం.