మరోసారి 'వి' సెంటిమెంట్ ని నమ్ముకున్న అజిత్

Thu,November 23, 2017 04:47 PM
మరోసారి 'వి' సెంటిమెంట్ ని నమ్ముకున్న అజిత్

చాలా మంది సినిమా వాళ్లకి తమ మూవీ ప్రారంభానికి, రిలీజ్ కు కొన్ని నమ్మకాలుంటాయి. అలాగే సినిమా పేరు విషయంలో కూడా కొన్ని నమ్మకాలుంటాయి. టాలీవుడ్ లోనే కాదు.. కోలీవుడ్ లో కూడా ఈ నమ్మకాలున్నాయి. మాములుగా వి అంటే విక్టరీ అని భావిస్తాం. అయితే కోలీవుడ్ క్రేజీ స్టార్ అజిత్ సినిమాల పేర్లు కూడా వి అనే అక్షరంతో మొదలవుతున్నాయి.

అజిత్ కు ఎలాంటి సెంటిమెంట్స్ లేకపోయినా .. ఆయన నిర్మాతలకు ఉన్నాయనిపిస్తోంది. గతంలో 'వి' అక్షరంతో మొదలైన వాలి .. విలన్ .. వీరం .. వేదాళం , వివేగం చిత్రాలు అజిత్ కి సూపర్ సక్సెస్ ను ఇచ్చాయి. దాంతో వి సెంటిమెంట్ ఏర్పడిపోయింది. ఈ క్రమంలో దర్శకుడు శివతో కలిసి విశ్వాసం అనే టైటిల్ తో ఓ మూవీ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని వివేగం నిర్మాతలు నిర్మించనున్నట్టు సమాచారం. 2018 నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. శివ-అజిత్ కాంబినేషన్ లో వీరం, వేదాళం, వివేగం చిత్రాలు రూపొందిన సంగతి తెలిసిందే.

777

More News

VIRAL NEWS