భార్య నెంబ‌ర్ షేర్ చేసిన హీరో.. విష‌యం తెలుసుకొని షాక్

Tue,September 25, 2018 11:03 AM
ajay gives shock to his fans

బాలీవుడ్ క్రేజీ క‌పుల్ అజ‌య్ దేవ‌గ‌ణ్‌, కాజోల్‌లు ఎంత హుందాగా ఉంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే కాజోల్ ప్ర‌స్తుతం ఇండియాలో లేని కార‌ణంగా త‌న భార్య‌కి ఏదైన‌ చెప్పాల‌నుకునే వారు ఈ నెంబ‌ర్‌కి పోస్ట్‌లు పెట్టొచ్చ‌ని కాజోల్ వాట్సాప్ నెంబ‌ర్ ట్వీట్ చేశారు అజ‌య్‌. అయితే దీనిపై అభిమానుల‌లో ప‌లు అనుమానాలు నెల‌కొన్నాయి. మ‌రిచిపోయి మెసేజ్ పెట్టాడా లేదంటే కావాల‌నే చేశారా తెలియ‌క అభిమానులు జుట్టు పీక్కున్నారు. కొంద‌రు అభిమానులు కాజోల్ నెంబ‌రే అనుకొని డ‌య‌ల్ చేయ‌గా వార్వ‌ర్డ్ అని వ‌చ్చింద‌ట‌. వాట్స‌ప్ మెసేజ్ చేస్తే మెసేజ్‌ను రిసీవ్ చేసుకోలేదట‌ కాని, సింగిల్ టిక్ మాత్రమే కనిపించిందట‌. ఇలా నెటిజ‌న్స్ త‌మ ఎక్స్‌పీరియెన్స్‌ని సోష‌ల్ మీడియా ద్వారా అజ‌య్ దేవ‌గ‌ణ్‌తో షేర్ చేసుకున్నారు. దీనికి త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించిన అజ‌య్ సెట్స్‌ లో ప్రాంక్స్‌ చేయడం పాత పద్ధతి. అందుకే కొత్తగా మీతో ప్రాంక్‌ ప్లే చేశాను అని స‌మాధాన‌మిచ్చారు.దీనిపై విదేశాల్లో ఉన్న కాజోల్‌ స్పందించింది. "మీరు చేస్తున్న ప్రాంక్స్‌ స్టూడియోను దాటి వెళ్లాయ్‌. కానీ ఇలాంటి వేషాలు ఇంట్లో కుదరవు" అని వార్నింగ్ ఇచ్చింది.


2337
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles