ఇండియన్ 2 ప్రాజెక్ట్‌లో న‌టించ‌క‌పోవ‌డానికి కార‌ణం ఇదే..!

Sun,February 17, 2019 10:25 AM

బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ ఈ మ‌ధ్య వార్త‌ల‌లో ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాడు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఆర్ఆర్ఆర్‌లో విల‌న్‌గా న‌టిస్తున్నాడ‌ని కొన్ని వార్త‌లు రాగా, శంక‌ర్ తాజా చిత్రం ఇండియ‌న్ 2లోను కీల‌క పాత్ర పోషించ‌నున్నాడ‌ని సోష‌ల్ మీడియాలో అనేక వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై అభిమానుల‌లో ప‌లు అనుమానాలు నెల‌కొన‌గా, తాజాగా అజ‌య్ దేవ‌గ‌ణ్ క్లారిటీ ఇచ్చాడు. భార‌తీయుడు 2 చిత్రంలో విల‌న్ పాత్ర పోషించ‌మ‌ని శంక‌ర్ న‌న్ను సంప్ర‌దించిన మాట వాస్త‌వ‌మే. కాని నేను ప్ర‌స్తుతం తానాజీ అనే సినిమాతో బిజీగా ఉండ‌డం వ‌ల‌న డేట్స్ అడ్జెస్ట్ చేయ‌లేన‌ని చెప్పాను. మ‌రోవైపు ఆర్ఆర్ఆర్ లో న‌టిస్తున్నానంటూ వ‌స్తున్న వార్త‌ల‌లో ఏ మాత్రం నిజం లేదు. రాజ‌మౌళి ఇంత వ‌ర‌కు న‌న్ను సంప్ర‌దించ‌లేదు కూడా. త్వ‌ర‌లో తానాజీ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్‌తో మీ ముందుకు వ‌స్తాను అని బ‌దులిచ్చాడు. శంక‌ర్ ఇండియ‌న్ 2 , రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ చిత్రాలు ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న సంగ‌తి తెలిసిందే.

2545
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles